రాష్ట్రీయం

ప్రజలకు ఇబ్బంది లేకుండా డంపింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 25: పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డును జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు గురువారం అధికారులు, ప్రజలతో కలిసి పరిశీలించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చెన్నైకు చెందిన శాస్తవ్రేత్త డాక్టర్ సీ పాల్‌పాండి, బెంగళూరుకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి అదనపు సంచాలకులు డాక్టర్ ఎం మధుసూదన్, విజయవాడ, విశాఖపట్నం నుండి పర్యావరణ శాఖ ఇంజనీర్లు శివప్రసాద్, ఎన్‌వి భాస్కర్ ఈ బృందంలో ఉన్నారు. అనంతరం స్థానిక సుజల అతిథి గృహంలో అధికారులు, ప్రజలతో సమావేశమయ్యారు. గతంలో ఢిల్లీ నుండి జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చెందిన సభ్యులు ఇక్కడ పరిశీలన జరిపిన సందర్భంగా డంపింగ్ యార్డులో పర్యావరణ పరిరక్షణ కోసం సూచించిన చర్యలు అమలుతీరును పరిశీలించడానికి ఈ బృందం వచ్చింది. ప్రజల జీవన విధానానికి ఎటువంటి విఘాతం కలగని రీతిలో డంపింగ్ యార్డు నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు అధికారులను ఆదేశించారు. అలాగే గత పర్యటన సందర్భంగా తమ పరిశీలనకు వచ్చిన నాలుగు అంశాలపై సమగ్ర సమాచారంతో నివేదిక అందించాలని కోరారు. ప్రస్తుతం ప్రాజెక్టు డంపింగ్ యార్డుకు సంబంధించిన తాజా సమాచారం కూడా కావాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డు నిర్వహణను ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని అమలుచేయాలని ఇంజనీరింగ్ అధికార్లను ఆదేశించారు. ముందుగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
చిత్రం...‘పోలవరం’ డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు