రాష్ట్రీయం

బిఎస్‌ఎన్‌ఎల్‌ను రక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థను రక్షించాలని, రిలయన్స్ సంస్థను జాతీయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీ ఎస్ బోస్ కోరారు. గురువారం ఏఐటీయూసీ రౌండ్ టేబుల్ సమావేశం సత్యనారాయణరెడ్డి భవన్‌లో అధ్యక్షుడు ఎస్ బాలరాజ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గౌరవాధ్యక్షుడు టీ నరసింహన్, ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, ఐఎఫ్‌టీయూ నేత కే సురేందర్, సీఐటీయూ నేత మధు, ఐఎన్‌టీయూసీ నేత డీ నారాయణ రావు, డిఫెన్స్ సంఘాల ప్రతినిధి బీ చంద్రయ్య, ఐఎఫ్‌టీయూ నేత శ్రీనివాస్, భరత్, ఎస్‌ఏ నాయుడు, ఏ అజీజ్, కే ముత్తు, నర్సింహా, భీంలాల్, టీ నరేందర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. అన్ని కార్మిక సంఘాలూ, ఉద్యోగ సంఘాలు ఈ మేరకు ప్రధానమంత్రికి వినతిపత్రాలు పంపంచాలని తీర్మానించారు. తదుపరి సమావేశాన్ని మే నెలాఖరులో ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలని తీర్మానించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను కేంద్ర ప్రభుత్వ పరిధి నుండి తప్పించి కార్పొరేషన్ చేస్తామని ఇచ్చిన హామీని అమలుచేయలేదని, బీఎస్‌ఎన్‌ఎల్‌ను నష్టాల ఊబిలోకి నెడుతూ ప్రభుత్వం నుండి రావల్సిన బకాయిలు చెల్లించడం లేదని దానివల్ల ఆ సంస్థకు భారీ నష్టమే వాటిల్లిందని అన్నారు.