ఆంధ్రప్రదేశ్‌

సీమలో చండప్రచండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం/విశాఖ, ఏప్రిల్ 10: రాయలసీమలో భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ప్రతి రోజూ 40 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 40.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రంలో 40.4, బుక్కపట్నం మండలంలో అత్యధికంగా 44.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా జిల్లాలోని 90 ఆటోమేటిక్ వెదర్‌స్టేషన్లలో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా కర్నూలు నగరంలో 40.9, ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కాగా జిల్లాలోని 103 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా కడపలో 43.5, బద్వేలులో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని 77 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో 40 డిగ్రీల సెల్సియస్ పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బకు నలుగురు మృతి
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోను ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖలో ఆదివారం సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా తుని, నందిగామలో 41 డిగ్రీలు, తిరుపతి, రెంటచింతల, గన్నవరంలో 40 డిగ్రీలు, నెల్లూరులో 38 డిగ్రీలు, కాకినాడ, కావలిలో37 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో వేడిగాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఆదివారం ఒక్క రోజే నలుగురు వృద్ధులు వడదెబ్బకు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పంచాయతీలో జి మల్లేసు (58), శ్రీకాకుళం మండలం వాకవలస గ్రామానికి చెందిన బగాది చక్రపాణి (59), విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి చెందిన బెవర అచ్చియమ్మ (70), విశాఖ జిల్లా రావికమతం మండలం జెడ్ గంగవరం గ్రామానికి చెందిన గొల్లల ధర్మరాజు (65) మృత్యువాత పడ్డారు.