రాష్ట్రీయం

పోలీస్ పంపకాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివిధ క్యాడర్ల ఉద్యోగుల విభజన ప్రక్రియను కమలనాథన్ కమిటీ కొలిక్కి తీసుకువచ్చింది. ఉద్యోగుల విభజనలో క్లిష్టమైన పోలీసు శాఖలో విభజన ప్రక్రియను ఎట్టకేలకు పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్‌పి), ఆర్మ్‌డ్ రిజర్వు (ఎఆర్), హైదరాబాద్ నగర పోలీసు విభాగాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తి చేసి ప్రధాన ప్రక్రియను పూర్తి చేసింది. కానిస్టేబుల్ నుంచి ఇన్‌స్పెక్టర్ వరకు ఎపిఎస్‌పి, ఎఆర్ విభాగంలో 18 వేలమంది ఉద్యోగులు ఉన్నట్లు ఆయా విభాగాల అధిపతులు కమలనాథన్ కమిటీకి నివేదికలను అందించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఇటీవల కేంద్ర హోంశాఖకు కమలనాథన్ కమిటీ పంపించింది. కేంద్రం ఈ నివేదికను ఆమోదించగానే ఉద్యోగుల విభజన జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న కమిటీ హైదరాబాద్‌లో సమావేశమై విభజన అనంతరం ఏయే రాష్ట్రానికి ఎంతమంది ఉద్యోగులు వెళ్లాల్సి ఉంటుందనే అంశంపై జాబితా తయారు చేశారు. అనంతరం అభ్యంతరాలు ఏదైనా ఉంటే తెలియజేయాలని సంబంధిత విభాగాలకు కమిటీ తెలియజేసింది. అనంతరం కమలనాథన్ నేతృత్వంలో కమిటీ ప్రతినిధులు ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి (ఎపి), ఎస్.రామకృష్ణరావు (తెలంగాణ), కేంద్ర పర్సనల్, ట్రైనింగ్ శాఖ డైరక్టర్ ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై ఆయా పోలీసు విభాగాల అధిపతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఆ తర్వాత తుది జాబితాను తయారు చేసి కేంద్రానికి కమిటీ పంపించింది. ఇదిలావుంటే పోలీసు శాఖ తర్వాత మరో పెద్ద విభజన ప్రక్రియ వైద్య, ఆరోగ్య శాఖలో చేపట్టాల్సి ఉంది. కానీ ఆ శాఖలో ఇంతవరకు ఉద్యోగుల విభజనకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎపిఎస్‌పి తర్వాత అధికంగా వైద్య ఆరోగ్య శాఖలో 10 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల సంఖ్య వివరాలను ఆయా శాఖాధిపతులు ఇంతవరకు ఇవ్వని కారణంగా ఈ శాఖలో ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. ఉద్యోగుల సంఖ్య విషయంలో ఈ శాఖ పరిధిలో పని చేస్తున్న డాక్టర్లు తమ స్థానికత నిర్థారణకు పాఠశాల విద్య ధృవపత్రాలను ఇంతవరకు సమర్పించలేదు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో ఎవరైతే పాఠశాల విద్య ధృవపత్రాలను సమర్పించలేదో వారిపై చర్యలు తీసుకునేందుకు సర్క్యులర్ జారీ చేయాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది. ఇదిలావుంటే మొత్తం మీద 90 శాఖల్లో 153 విభాగాల్లోని ఉద్యోగులను స్థానికత నిర్థారణ సహా మరికొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉంది.