రాష్ట్రీయం

సరకులతో సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 11: రేషన్ పంపిణీలో ఏ జిల్లాలో లేని కొత్త విధానాలను నాలుగు జిల్లా ల్లో అమలు చేస్తుండటంతో కార్డుదారులు, డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. నూతన విధానంపై డీలర్ల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కాగా ఈ కొత్త విధానం ఇటు కార్డుదారులనూ ఇబ్బందుల పాల్జేస్తోంది. తొలుత కృష్ణా జిల్లాలో మొదలైన ఈ విధానాన్ని క్రమంగా పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం జిల్లాలకు విస్తరించారు. ఈ కొత్తవిధానం ఏమిటంటే రేషన్ డిపోల్లో సరుకులు నెల మొదటి వారంలోనే అందించటం. డీలర్లపై ఈ విధానం ఒత్తిడి పెంచుతుంది. పైగా వినియోగదారులు ఐదో తేదీలోగా సరకులు తీసుకోకపోతే ఆ తరువాత ఇవ్వరు. దీంతో అటు కార్డుహోల్డర్లూ ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ విధానం విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంతకుముందే ప్రారంభమైనా ప్రాథమిక దశలోనే దీన్ని విరమించుకున్నారు. పాత విధానంలో రేషన్ దుకాణాల నుంచి కార్డుదారులు ప్రతి నెలా 15వ తేదీ వరకు సరుకులు తీసుకునే వీలుండేది. రేషన్ పంపిణీకి ఇటీవలి కాలంలో ఈపాస్ విధానాన్ని జోడించారు. ఈపాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయక ఈ విధానంపైనే తీవ్ర అసంతృప్తి, అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. కాగా రేషన్ డిపోల్లో ఇచ్చే సరుకులను నెలలో పదవ తేదీలోగా ఇచ్చేయాలనే విధానానికి కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. పదో తేదీలోగా సరుకులు తీసుకోపోతే ఇక హుళక్కే. ఆ తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాలు కూడా ఈవరుసలో చేరాయి. అక్కడ కూడా నెలలో మొదటి పది రోజుల్లో మొత్తం సరుకులు పంపిణీ చేయాలంటూ డీలర్లకు ఆదేశాలు వెలువడ్డాయి. ఆ విధంగా ఆ మూడు జిల్లాల్లోనూ రేషన్ సరుకులు పంపిణీని పూర్తిగా నియంత్రిస్తూ ముందుకు తీసుకువెళ్లారు.
తాజాగా ఆ వరుసలో పశ్చిమగోదావరి చేరింది. అయితే ఆ జిల్లాల కన్నా ఒక అడుగు ముందుకేసి, ప్రతి నెలా ఐదో తేదీలోగా మొత్తం సరుకులు పంపిణి చేసేయాలంటూ ఇక్కడ ఆదేశాలు వెలువడ్డాయి. ఇక అక్కడి నుంచి డీలర్లకు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించటం, అయిదురోజుల్లోగా మొత్తం సరుకులు ఇచ్చేయాలంటూ అధికారులు తరమటం ప్రారంభమైంది. అయిదు రోజుల్లో పంపిణీ అనేది అసాధ్యంగా మారిందని డీలర్ల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.
డీలర్ల ప్రాధాన్యత తగ్గించడానికేనా?
సరుకుల పంపిణీకి తమకిస్తున్న కమిషన్ సరిపోవడంలేదని, తమకు నెలవారీ రూ.15వేలు గౌరవభృతి చెల్లించాలని, నిర్వహణ ఖర్చుల కింద మరో ఆరువేల రూపాయలు చెల్లించాలని, హెల్త్‌కార్డులు అందించాలనే డిమాండ్లతో డీలర్లు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే సబ్-కమిటీని అధ్యయనం నిమిత్తం నియమించింది. అయితే నేటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కొత్త విధానంలో డీలర్లు నెల మొత్తం పనిచేయనక్కర్లేదని, కేవలం మొదటి అయిదు, పది రోజులపాటు అందుబాటులో ఉంటే చాలన్న అభిప్రాయం ప్రభుత్వవర్గాల్లో ఉంది. నెలలో పది రోజులు మాత్రమే పనిచేసేటప్పుడు వారి డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం కూడా ఉండదన్నది ప్రభుత్వం ఎత్తుగడగా డీలర్లు చెబుతున్నారు.