రాష్ట్రీయం

పులివెందులలో ప్రజాదర్బార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పులివెందులలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమయ్యారు. కడప జిల్లా పులివెందుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను జగన్‌కు ఏకరువు పెట్టారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలుకరిస్తూ వారి సమస్యలు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పింది ఓపిగ్గా విన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు శ్రీకాంత్‌రెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, సుధీర్‌రెడ్డి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్ సరళి గురించి జగన్‌కు వివరించారు. కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్.అవినాష్‌రెడ్డి, వైకాపా నాయకుడు నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ప్రతి నాయకుడు, కార్యకర్తను పేరుపేరున జగన్‌కు పరిచయం చేశారు. వివిధ కులసంఘాల నేతలు, మత పెద్దలు జగన్‌ను కలిశారు.

చిత్రం...పులివెందులలో చంటిబిడ్డతో వచ్చిన తల్లిని పరామర్శిస్తున్న జగన్