రాష్ట్రీయం

వివాదానికి కేంద్ర బిందువు శాతవాహన వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 15 దేశ ప్రగతికి పట్టుకొమ్మల్లాంటి మేధావులను అందించిన కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం నేడు వివాదాలకు వేదికవుతోంది. తెలంగాణ విద్యార్థి వేదిక మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తూ సభ్యత్వాల నమోదు ముమ్మరం చేసిందని సోషల్ మీడియాలో వైరల్ కావడం, వెంటనే మావోయిస్టులతో టీవీవీకి ఎలాంటి సంబంధాలు లేవని, కావాలనే మావోయిస్టులతో అనుబంధం కొనసాగిస్తున్నట్లు ముద్రవేయడం విచారకరమని టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి వెల్లడించగా, వెనువెంటనే సీపీ వి.బి.కమలాసన్ రెడ్డి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి టీవీవీకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని వెల్లడించడం పోటా పోటీగా బుధవారం ప్రెస్‌మీట్‌లు ఏర్పాటు చేయడంతో కరీంన‘గరం..గరం’గా మారింది. దేశ ప్రగతికి పట్టుకొమ్మల్లాంటి విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులను మావోలు పావులుగా వాడుకునేందుకే టీవీవీ పేర సభ్యత్వ నమోదవుతుందని, నక్సలైట్ల బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ఆధారంగా ఒక్కసారిగా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. ఆ దిశగానే విచారణను ముమ్మరం చేశారు. అందరి చూపు ఆ విశ్వవిద్యాలయంపై పడింది. అనేక ఆవిష్కరణలకు వేదికైన ఆ విశ్వవిద్యాలయం గతానే్న మార్చేసాయి. గతమెంతో ఘనకీర్తి శాతవాహన యూనివర్సిటీ కానీ రెండు విద్యార్థి సంఘాల మధ్య చిలికి చిలికి గాలివానలా మొదలైన వివాదం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొక సంఘం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. సీపీ కమలాసన్ రెడ్డి కలుగ చేసుకొని టీవీవీకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని వెల్లడించే పరిస్థితికి చేరింది. రెండు విద్యార్థి సంఘాల మధ్య మొదలైన విభేదాలు టీవీవీ మావోయిస్టులతో సంబంధాలు అంటగట్టే స్థాయికి చేరాయి. ఇక్కడ అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడగా, విద్యార్థులు భద్రాచలం స్టడీ టూర్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని, మావోయిస్టు అనుబంధంగా సభ్యత్వాల నమోదు ఇక్కడ జరుగుతుందని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ కూడా వెల్లడించారు. ఏది ఏమైనా ఆరని జ్వాలకు కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వేదిక కావడం ఇందుకు ఇరు విద్యార్థి సంఘాలు ఆజ్యం పోసుకుంటుండడం అందరినీ ఆలోచనలో పడేయగా ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం చూపు శాతవాహన యూనివర్సిటీపై పడడం, ఆ దిశగానే విచారణను ముమ్మరం చేయడం, నిఘా కొనసాగించడం, ఆరోపణలు, ప్రత్యారోపణలతో శాతవాహన యూనివర్సిటీ అట్టుడికిపోతుండడం గమనార్హం.