రాష్ట్రీయం

10 జీపీఏ వచ్చింది కేవలం 8676 మందికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించిన తమ విద్యార్థులు లక్షల్లో ఉన్నారని ప్రచారం చేసుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లకు ముకుతాడు వేస్తూ పరీక్షల బోర్డు వాస్తవ గణాంకాలను విడుదల చేసింది. రాష్టవ్య్రాప్తంగా 10/10 జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్య కేవలం 8676 మాత్రమే, కాగా పలు కార్పొరేట్ స్కూళ్లు తమ విద్యార్థులే వేలల్లో ఉత్తీర్ణులయ్యారని బహిరంగంగా ప్రకటనలు విడుదల చేశాయి. రాష్టవ్య్రాప్తంగా పదో తరగతి పరీక్షలకు 5,06,202 మంది హాజరుకాగా, వారిలో 4,67,859 మంది ఉత్తీర్ణులయ్యారని పరీక్షల బోర్డు సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. వీరిలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన వారు కేవలం 8676 మంది మాత్రమేనని, ఇది కేవలం 1.85 శాతంగా ఉందని అన్నారు. 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించిన వారు 13498 మంది, 9.0 నుండి 9.7 గ్రేడ్ పాయింట్లు సాధించిన వారు 98,754 మంది మాత్రమేనని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో 10/10 గ్రేడ్ పాయింట్ సాధించిన వారు కేవలం 7924 మంది మాత్రమే. ఎయిడెడ్‌లో 101 మందికి, ఆశ్రమ పాఠశాలల్లో ఇద్దరికి, బీసీ వెల్ఫేర్‌లో 11 మందికి, ప్రభుత్వ పాఠశాలల్లో 10 మందికి, కేజీబీవీల్లో 8 మందికి, మోడల్ స్కూళ్లలో 210 మందికి, రెసిడెన్షియల్ స్కూళ్లలో 42 మందికి, సోషల్ వెల్ఫేర్‌లో 52 మందికి, ట్రైబల్‌వెల్ఫేర్‌లో ఏడుగురికి, జిల్లా పరిషత్ స్కూళ్లలో 299 మందికి మాత్రమే 10/10 గ్రేడ్ పాయింట్ దక్కింది. అదే 9.8 గ్రేడ్ పాయింట్‌లు చూస్తే ఎయిడెడ్‌లో 155 మందికి, ఆశ్రమ పాఠశాలల్లో 14 మందికి, బీసీ వెల్ఫేర్‌లో 17మందికి, ప్రభుత్వ పాఠశాలల్లో 43 మందికి, కేజీబీవీల్లో 39 మందికి, మోడల్ స్కూళ్లలో 535 మందికి, ప్రైవేటు స్కూళ్లలో 11,493 మందికి, రెసిడెన్షియల్‌లో ఒక్కరికి, మైనార్టీ రెసిడెన్షియల్స్‌లో ఒక్కరికి, సోషల్‌వెల్ఫేర్‌లో 135 మందికి, ట్రైబల్ వెల్ఫేర్‌లో 30మందికి, జిల్లా పరిషత్‌లో 940 మందికి దక్కాయి. వాస్తవాలు ఇలా ఉండగా, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు వేలకు వేలు తమకే 10/10 గ్రేడ్ పాయింట్లు వచ్చినట్టు ప్రకటనలు జారీ చేయడం విడ్డూరం.