ఆంధ్రప్రదేశ్‌

మండు వేసవిలోనూ నిండు కుండల్లా రిజర్వాయర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 16: ఎన్నడూ లేనివిధంగా ఈ వేసవిలో తూర్పు గోదావరి జిల్లాలో రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఒక్క సుబ్బారెడ్డి సాగర్ రిజర్వాయరు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం మినహా మిగిలిన అన్ని రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రిజర్వాయర్లకు వేసవి ప్రభావం ఇంకా తగల్లేదనే చెప్పవచ్చు. ఈలోగా వర్షాలు మొదలైతే ఈ ఏడాది రిజర్వాయర్లు నిండు కుండల్లానే వేసవిని అధిగమించే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. మండు వేసవిలో సైతం జీవనది గోదావరి నుంచి వేల క్యూసెక్కుల జలాలు వృథాగా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితివుంది. కేవలం సుమారు 3.14 శతకోటి ఘనపుటడుగులు జలాలు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఇక్కడ ఉండటంతో మిగిలిన జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గురువారం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద 10.90 మీటర్ల నీటి మట్టం నమోదైంది. బ్యారేజి నాలుగు ఆర్మ్‌ల నుంచి 4139 క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి విడుదలవుతున్నాయి. గోదావరి నదిలో 4602 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఒక్క సీలేరు నుంచే గోదావరి నదిలోకి 4243 క్యూసెక్కులు పవర్ జనరేషన్ జలాలు విడుదలవుతున్నాయి. జిల్లాలో మరో ప్రధాన రిజర్వాయరు అయిన ఏలేరుకు కేవలం 15 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వుంది. అవుట్ ఫ్లో మాత్రం 260 క్యూసెక్కులు వుంది. ఏలేరు ఎడమ కాల్వ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 195 క్యూసెక్కులు సరఫరా అవుతున్నాయి. ఇక జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను ఒకసారి పరిశీలిస్తే గోదావరి డెల్టా సిస్టమ్ (సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి) వద్ద 13.96 మీటర్లు నీటి మట్టంలో నమోదు కాగా 3.144 టీఎంసీల జలాలున్నాయి. గత పదేళ్ల సరాసరి 2.985 టీఎంసీలు మాత్రమే. ఏలేరు రిజర్వాయర్ 78.74 మీటర్ల ఎఫ్ ఆర్ ఎల్‌లో సుమారు 12 టీఎంసీల జలాలున్నాయి. గత పదేళ్ల సరాసరి 7.551 టీఎంసీలు మాత్రమే. సుబ్బారెడ్డి సాగర్ రిజర్వాయర్ 75.35 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ అయితే కేవలం 0.025 టి ఎంసీలు మాత్రమే వున్నాయి. గత పదేళ్లలో ఈ రిజర్వాయర్ సరాసరి 0.048 టీఎంసీలు. మద్దిగడ్డ రిజర్వాయర్‌లో 180.90 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్ స్థాయిలో 0.133 టీఎంసీల జలాలున్నాయి. గత పదేళ్ల సరాసరి 0.174 టీఎంసీలు పంపా రిజర్వాయరులో 0.017 టీఎంసీలు నిల్వవున్నాయి. గత పదేళ్ల సరాసరి 0.020 టీఎంసీలు. ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్టోరేజి సామర్ధ్యం 24.110 టి ఎంసీలు కాగా ప్రస్తుతం 12.040 టీఎంసీల నీరువుంది. దీని డెడ్ స్టోరేజి సామర్ధ్యం మాత్రం 6.160 టీఎంసీలు. సుబ్బారెడ్డి సాగర్ పూర్తి రిజర్వాయర్ సామర్ధ్యం 0.234 టిఎంసీలు కాగా, ఇపుడు 0.025 టీఎంసీలకు చేరుకుంది. మద్దిగడ్డ రిజర్వాయరు సామర్ధ్యం 0.485 టీఎంసీలు కాగా 0.133 టీఎంసీల నీరు నిల్వవుంది. డెడ్ స్టోరేజి మాత్రం 0.051 టీఎంసీలు. పంపా రిజర్వాయరు పూర్తి సామర్ధ్యం 0.564 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.017 టీఎంసీలు నిల్వవున్నాయి. డెడ్ స్టోరేజి సామర్ధ్యం 0.007 టీఎంసీలు. మొత్తం మీద ఒక్క సుబ్బారెడ్డి సాగర్ తప్ప మిగిలిన అన్ని రిజర్వాయర్లు నిండుగానే వున్నాయి. రిజర్వాయర్లు నిండుగానే వున్నప్పటికీ జిల్లాలో మాత్రం భూగర్భ జలాలు మాత్రం పెరగకపోవడం గమనార్హం.
చిత్రం... ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి సముద్రంలోకి వదిలేస్తున్న మిగులు జలాలు