రాష్ట్రీయం

ఏటీఎంల మాదిరి చెడిపోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: 2019 సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ వెరిఫియేబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) లలో ఓటర్ స్లిప్పుల ముద్రణకు ఉపయోగించిన ఇంక్ అసాధారణమైందని, ఇది చెదిరిపోయే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, 2019 సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం), ఓటర్ వెరిఫియెబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) మిషన్లు సమర్థతగా పనిచేశాయన్నారు. ఈవీఎంలలో బటన్‌ను ఉపయోగించి ఓటరు ఓటు వేసిన వెంటనే వారు వేసిన ఓటు సీరియల్ నెంబర్, పేరు, గుర్తులు వీవీప్యాట్ ట్రాన్స్ప్‌రెంట్ విండో ద్వారా ఏడు సెకన్లపాటు కనిపించాయన్నారు. ఈ ఏడు సెకన్లలో ఓటరు తాను ఎవరికి ఓటు వేసారో వారికి తెలిసిపోయిందన్నారు. ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత ఓటర్ స్లిప్పు ప్రధాన పేపర్ బండిల్ నుండి కట్ అయిన స్లిప్పు బాక్సులో పడ్డదన్నారు. దాదాపు రెండుకోట్ల మంది ఓటర్లు ఓటు వేయగా, ఏ ఒక్కరి నుండి కూడా ఈవీఎంలు, వీవీప్యాట్లపనితీరుపై ఫిర్యాదు రాలేదన్నారు. ఈ నెల 23 న జరిగే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తెలంగాణలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయన్నారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదేసి వీవీప్యాట్లలోని ఓట్లను లెక్కిస్తామన్నారు. అంటే ప్రతి లోక్‌సభ స్థానంలో 35 వీవీప్యాట్లలో ఉండే ఓటర్‌స్లిప్పులను లెక్కిస్తామన్నారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రాంగణాలు ఏర్పాటు చేశామని, మొత్తం 82 హాళ్లను ఉపయోగిస్తున్నామన్నారు. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను, 110 అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపుకోసం 15 టేబుళ్లు (14+1) ఉంటాయని, నిజామాబాద్ లోక్‌సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 19 టేబుళ్లు (18+1) ఉంటాయన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలోని మేడ్చల్, ఎల్‌బీనగర్ సెగ్మెంట్లలో 29 టేబుళ్లు (28+1) ఉంటాయన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మపరిశీలకుడు ఉంటారన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మపరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఒక డీఈఓ ఉంటారన్నారు. లెక్కింపు ప్రక్రియలో 6,745 మంది సిబ్బంది పాల్గొంటారని రజత్ కుమార్ వివరించారు.