రాష్ట్రీయం

తెలంగాణకు నీటి కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: మండుతున్న ఎండలు, వేడిగాలులతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పాతాళానికి జారుకున్నాయి. రాష్ట్రంలో సగటు భూగర్భ జలాలు గత ఏడాది ఏప్రిల్ నెలలో 12.88 మీటర్ల లోతున ఉండగా, ఈ ఏడాది 14.14 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో భూగర్భ జలాలు అందుబాటులో లేక నగరాలు, పట్టణాలు, గ్రామ ప్రాంతాల్లో జనం నీటి కోసం అల్లాడుతున్నారు. గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నారు. రాష్ట్రంలో 28 శాతం భూభాగంలో 10 నుంచి 15 అడుగుల లోతున, 28 శాతం భూభాగంలో ఐదు నుంచి పది మీటర్ల లోతున నీరు లభ్యమవుతోందని భూగర్భ జల శాఖ పేర్కొంది. కాగా మొత్తంపైన గత ఏడాదితో పోల్చితే సగటున 1.37 మీటర్ల లోతుకు నీటి మట్టం జారింది. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో 584 మండలాలు ఉన్నాయి. ఇందులో 169 మండలాల్లో 20మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి లభ్యత ఉంది. ఇందులో 143 మండలాల్లో నీటి మట్టాలు మరింత లోతుకు దిగజారాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో లంకెలపల్లిలో 28.76 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. రాష్ట్రంలో భూగర్భ జలశాఖ సర్వే చేసిన బావుల్లో 36 శాతం బావుల్లో నీటి మట్టాలు పెరగగా, 64 శాతం బావుల్లో నీరు పాతాళానికి చేరింది. రాష్ట్రంలో కొమురం భీం జిల్లాలో సిర్పూర్ మండలంలో 0.07 మీటర్ల లోతున నీటి లభ్యత ఉండగా, నల్లగొండ జిల్లా మర్రి గూడ మండలంలో కుడాబకాస్‌పల్లి గ్రామంలో 59 మీటర్ల లోతుకుపైగా నీటి మట్టం దిగజారింది.
జిల్లాల వారీగా విశే్లషిస్తే ఆదిలామాద్ జిల్లాలో 0.69 మీటర్ల లోతుకు, భద్రాద్రి జిల్లాలో 2.13 మీటర్ల లోతుకు, భూపాలపల్లి జిల్లాలో -1.07 మీటర్లు, హైదరాబాద్‌లో -1.79 మీటర్లు, జగిత్యాల జిల్లాలో 1.05 మీటర్లు, జనగాంలో -1.38 మీటర్లు, జోగుళాంబ జిల్లాలవో -3.39 మీటర్లు, మంచిర్యాల జిల్లాలో -4.22 మీటర్లు, మెదక్ జిల్లాలో -4.92 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో -6.75 మీటర్లు, సిద్ధిపేట జిల్లాలో -2.55 మీటర్లు, వికారాబాద్ జిల్లాలో -3.28 మీటర్ల లోతుకు సగటున నీటి మట్టాలు పడిపోయాయి.
రాష్ట్రంలో 33 జిల్లాల్లో 15 జిల్లాలు సాధారణ వర్షపాతం, 18 జిల్లాలు -20 నుంచి -59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 30 మండలాల్లో ప్లస్ 20 శాతం, 255 మండలాల్లో సాధారణ వర్షపాతం, 288 మండలాల్లో -20 నుంచి -59 శాతం మేర లోతు వర్షపాతం నమోదైంది. 11 మండలాల్లో అతి తక్కువగా -60 శాతం మేర వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో -26, జనగాంలో -20, జోగుళాంబ జిల్లాలో -29, కామారెడ్డిలో -26, మహబూబ్‌నగర్‌లో -22, మెదక్‌లో -40, మేడ్చెల్ మల్కాజగిరిలో -27, నాగర్‌కర్నూలులో -35, నల్లగొండలో -36, రాజన్న జిల్లాలో -20, రంగారెడ్డి జిల్లాలో -28, సంగారెడ్డిలో -45, సిద్ధిపేటలో -28, సూర్యాపేటలో -23, వికారాబాద్‌లో -36, వనపర్తిలో -28, వరంగల్ రూరల్‌లో -25, యాదాద్రిలో -42 శాతంలోటుగా వర్షపాతం నమోదు కావడం వల్ల కూడా భూగర్భజలాలు పాతాళానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో 865 ఎంఎం వర్షపాతానికి, 724 ఎంఎం వర్షపాతం నమోదైంది. మొత్తం 16 శాతం తక్కువగా నమోదైంది.సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, హైదరాబాద్‌లో భూగర్భ జల మట్టాలు 20 మీటర్ల కంటే లోతుకు జారినట్లు భూగర్భ జలశాఖ పేర్కొంది.
నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచి నీటి సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మంచి నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చవచ్చును. ప్రస్తుతం 510.08 అడుగుల నీటి మటటం ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 312 టీఎంసీకి కేవలం ప్రస్తుతం 133 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ఇక్కడి నుంచి రోజుకు 900 క్యూసెక్కుల నీటిని మంచినీటికి వదలుతున్నారు. ఇప్పటికే ప్రధాన కాల్వలకు నీటి సరఫరాను నిలిపివేశారు. శ్రీశైలంలో కేవలం 33.02 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ఇక్కడ 215 టీఎంసీ నీటి నిల్వసామర్థ్యం ఉంది. పులిచింతలలో కేవలం 1.95 టీఎంసీ నీటి నిల్వ ఉంది. మండుతున్న ఎండలు, వడగాడ్పులతో నీటి ఆవిరి శరవేగంగా ఉంది. దీని వల్ల భూగర్భ జలాలు త్వరితగతిన పాతాళంలోకి జారుకుంటున్నాయి.