రాష్ట్రీయం

కాదు.. టీడీపీనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 19: ‘‘నవ్యాంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. వైకాపాకు మళ్లీ ప్రతిపక్ష స్థానమే. రాష్ట్రంలో జరిగిన త్రిముఖ పోటీలో జనసేనకు 11 శాతానికి అటూ ఇటూగా ఓట్లు పడ్డాయి. ఇదీ నా సర్వే.. నమ్మితే నమ్మండి.. లేకుంటే లేదు. నేను ఈవీఎంల్లోకి తొంగి చూడలేదు’’ అంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వే వివరాలను వివరించారు. విలేఖరుల సమావేశం సాయంత్రం 6 గంటలకని చెప్పినా, ఎన్నికల సంఘం విధించిన గడువు 6.30 వరకు ఉండటంతో అప్పటి వరకు ఆయన వేచి చూశారు. 6.30 గంటల తరువాత ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠత రేపాయన్నారు. ఆర్‌జి ప్లాస్టీ ద్వారా జనవరి నుంచి దశలవారీగా సర్వే చేశామని, ఎన్నికల తరువాత కూడా తాము ప్రజాభిప్రాయాన్ని సేకరించామన్నారు. మహిళలు, కొత్తగా ఓటుహక్కు పొందిన యువతను అందరినీ తమ సర్వేలో కలిశామన్నారు. అందరి అభిప్రాయాలను శాస్ర్తియంగా సమీకరించిన తరువాత ఈ అభిప్రాయానికి వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు చేసిన ప్రచారం కూడా ఎంతో కీలకంగా మారిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన త్రిముఖ పోటీలో వైకాపా, టీడీపీకి గట్టి పోటీ ఇచ్చిందన్నారు. బలవంతంగా, ఇష్టంలేని రాష్ట్రం ఏర్పాటులో రాజధాని లేకుండా, 60 మంది ప్రజలకు 40 శాతం నిధులు కేటాయింపు వంటి అంశాలు ప్రజలను ఆలోచింపజేశాయన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థం లాంటి రాజధాని నిర్మాణం అవసరం అని ప్రజలు భావించారన్నారు. చేపట్టిన ప్రాజెక్టులు, చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావాలంటే తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు భావించారని అన్నారు. అందుకే టీడీపీకి ఈ ఎన్నికల్లో 43 నుంచి 45 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని, దీంతో 100 నుంచి 110 వరకు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా మహిళలు టీడీపీకి అండగా నిలిచారని ఆయన అన్నారు. ఇక వైకాపా టీడీపీకి గట్టి పోటీ ఇచ్చిందన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించి సత్తా చాటిందన్నారు. అందువల్ల వైకాపాకు 41 శాతం ఓటింగ్‌తో 70 నుంచి 72 వరకు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఇక టీడీపీ 15కి అటూ ఇటుగా ఎంపీ స్థానాలను గెలుచుకుంటుందని, వైకాపాకు 10కి అటూ ఇటూగా ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. ఇక జనసేన, బీజేపీ, ఇతర పార్టీలకు కలిపి మూడు ఎమ్మెల్యే స్థానాలు దక్కే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైకాపా తరువాత మిగిలిన పార్టీలు ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం లేదని, ఒకవేళ గెలిస్తే ఒక్క స్థానం మాత్రమే దక్కుతుందన్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్న విషయం తాను చెప్పనని, దీనివల్ల ఓడిపోతారని తాను చెప్పిన అభ్యర్థులు ఆవేదన చెందే అవకాశం ఉందన్నారు.
టిఆర్‌ఎస్‌కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు
ఇక తెలంగాణలో జరిగిన లోకసభ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ టిఆర్‌ఎస్ 14 నుంచి 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఎంత ఉందో, ఏ స్థానంలోను గెలిచే అవకాశాలు కూడా లేవని అన్నారు. అలాగే బీజేపీతో సహా ఇతర పార్టీలు గెలిచే అవకాశాలు లేవని, గెలిస్తే ఒక్క స్థానంలో గెలవవచ్చని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ అస్త్ర సన్యాసం చేశాను:లగడపాటి
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తాము జనవరి నుంచి దశలవారీగా సర్వే చేశామని దాదాపు 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాల్లో లక్షా 50వేల మందిని సర్వే చేశామన్నారు. ఎంతో శాస్ర్తియ పద్ధతిలో, లోతుగా తమ సర్వే జరిగిందని ఆయన చెప్పారు. తన సర్వే ఫలితాలపై తాను ఎవరితోను విభేదించనని, ఇది తన సర్వే మాత్రమేనన్నారు. తాను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేశానన్న ఆయన తాను కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చానని, ఆ పార్టీతోనే రాజకీయాల నుంచి తప్పుకుని అస్తస్రన్యాసం చేశానన్నారు. తన సర్వే ఫలితాల్లో ఎలాంటి రాజకీయం లేదన్న లగడపాటి అన్ని పార్టీలు తనకు సమానమేనని స్పష్టం చేశారు. తనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వ్యాపారాలు లేవని, ఇతర రాష్ట్రాల్లోనే తాను వ్యాపారాలు చేసుకుంటున్నానని చెప్పారు. 2013లో ఏర్పాటు చేసిన ల్యాంకో ఫ్యాక్టరీని తనకు తెలియకుండానే ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డ త్రిముఖ పోటీలో టీడీపీ, వైకాపా, జనసేన మధ్యే పోటీ జరిగిందన్నారు. జనసేన పార్టీ ఎక్కువగా యువత ఓట్లను సంపాదించుకోగలిగిందన్నారు.
మనపై అధారపడే కేంద్రంతోనే మనకు లాభం
కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి ఏ పార్టీకి మెజార్టీ రాదన్న లగడపాటి రాజగోపాల్ ఎన్‌డీయే మెజార్టీకి దగ్గరగా రావచ్చని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం యూపీఏతో పాటు థర్డ్‌ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌లు ఏర్పడే అవకాశాలు ఎంతవరకు వాస్తవరూపం దాలుస్తాయో వేచి చూడాల్సిందేనన్నారు. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా అది ఆంధ్ర రాష్ట్రంపై ఆధారపడితే మనకు అదృష్టమన్నారు. లేకుంటే ఏపీకి మళ్లీ పోరాటాలు తప్పవని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంటుందని లగడపాటి స్పష్టం చేశారు.