రాష్ట్రీయం

చంద్రగిరి రీపోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, మే 19: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం జరిగిన రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఎండను సైతం లెక్కచేయకుండా ఓటింగ్‌లో పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో 89.29 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య ఓటింగ్ జరగడంతో ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేశారు. గతంలో ఎప్పుడు ఓటువేయని దళితులు కూడా ఓటింగ్‌లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఏడు పోలింగ్ కేంద్రాల్లో 5,451 ఓట్లగాను 4,867 ఓట్లు పోల్ అయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యిర్థి పులివర్తి నాని, ఎంపీ అభ్యర్థి శివప్రసాద్‌లు రీ పోలింగ్ జరిగిన గ్రామాల్లో ఓటింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. మొత్తంమీద గట్టిపోలీస్ బందోబస్తుతో రీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా పులివర్తివారిపల్లిలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సంఘటనపై పాకాల పోలీస్‌స్టేషన్‌లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కమ్మపల్లిలో మునిచంద్రనాయుడు అనే వ్యక్తి తన అమ్మమ్మ ఓటు వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఆర్ కమ్మపల్లిలో అఖరి క్షణంలో దొంగ ఓటు వేసేందుకు యత్నించిన రాంకుమార్‌నాయుడుని ఎన్నికల అధికారి డాక్టర్ మహేష్‌కుమార్ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న ఎన్నికల సరళిని వీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ క్రాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌లో రీ పోలింగ్ జరుగుతున్న కేంద్రాల్లో పర్యటించి భద్రతా చర్యలు పటిష్టంగా నిర్వహించారు. చంద్రగిరి ఎన్నికల అధికారి డాక్టర్ మహేష్‌కుమార్ రీపోలింగ్ జరిగిన గ్రామాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

చిత్రం...ఓటు వేసేందుకు క్యూలో వేచి ఉన్న ఓటర్లు