రాష్ట్రీయం

టెన్షన్.. టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నరాలు తెగే టెన్షన్‌తో రాజకీయ నేతలు నలిగిపోతున్నారు. ఆంధ్రాలోని 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్ల కోసం టీడీపీ, వైకాపా మధ్య కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్లీ ఎన్నికవుతారా లేదా 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటం తర్వాత సీఎం పదవిని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేజిక్కించుకుంటారా? అన్నది గురువారం మధ్యాహ్నం సమయానికి తేలిపోతుంది. మెజారిటీ సర్వే సంస్థలు వైకాపా గెలుపు ఖాయమని సూచించగా, మూడు, నాలుగు ఏజన్సీలు మాత్రం టీడీపీ స్వల్ప మెజార్టీతో నెగ్గుతుందని పేర్కొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైకాపా ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు పోటీ చేశాయి. సినీ నటుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కూడా కొన్నిచోట్ల గట్టిపోటీ ఇచ్చింది. వామపక్ష పార్టీలు, జనసేన కలిసి పోటీ చేసింది. కాంగ్రెస్, బీజేపీ పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాయి. ఇప్పటికే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి పరిధిలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించుకున్న నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు కూడా అమరావతికి చేరుకున్నారు. సన్నిహితులు, పార్టీ సీనియర్లతో సమావేశమై కౌంటింగ్ ప్రక్రియ తీరుపై వ్యూహప్రతివ్యూహాలతో ఉన్నారు. జగన్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్లు కూడా అమరావతికి చేరుకున్నారు. ఈ ఎన్నికలు వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్‌ను శాసించనున్నాయి. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన తండ్రి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో సీఎం పదవిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర విభజన జరిగిన 2014 ఎన్నికల్లో
టీడీపీతో తలపడ్డారు. ఆ ఎన్నికల్లో విజయం వరించినట్లే వరించి చేజారిపోయింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించకపోవడంతో వైకాపా 67 సీట్లకు పరిమితమైంది. నాటి ఎన్నికల్లో మోదీ గాలి, పవన్ కల్యాణ్ సినీ గ్లామర్‌తో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో బిహార్‌కు చెందిన సెఫాలజిస్టు, సుప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలతో పార్టీ గెలుపునకు ప్రణాళికను వైకాపా ఖరారు చేసింది. అలాగే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మూడు వేల కి.మీకుపైగా పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. వైకాపాకు అధికారం ఇస్తే నవరత్నాలు పేరిట సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. మరోపక్క చంద్రబాబుకూడా ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి రాజధాని అంశాల ప్రాతిపదికన జనంలోకి వెళ్లారు.
రాయలసీమలో నాలుగు జిల్లాల్లో 52 సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని వైకాపా ధీమాగా ఉంది. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో వైకాపా, టీడీపీ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 22 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు వస్తాయనే ఆత్మవిశ్వాసంతో వైకాపా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 33 సీట్లు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ వైకాపా మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో కనుక వైకాపా విజయం సాధిస్తే అధికార పీఠం ఖాయమని చెప్పవచ్చు. అలాగే ఈ రెండు జిల్లాల్లో అధిక స్థానాలను గెలుస్తామని, రాయలసీమలో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమాతో టీడీపీ ఉంది. గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో వైకాపా భంగపాటు చెందింది. కాగా ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు తమవేనని వైకాపా, అదంతా వట్టి భ్రమ అని, పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని టీడీపీ వాదిస్తోంది. ఇక ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వైకాపా, టీడీపీ మధ్య నువ్వా, నేనా అనే రీతిలో పోటీ జరిగింది. జనసేన వల్ల గోదావరి, ఉత్తరాంధ్ర కలిపి మొత్తం 68 అసెంబ్లీ సీట్లలో ఓట్లను గణనీయంగా చీల్చి తాను లాభపడుతుందా ? లేక టీడీపీ, వైకాపా గెలుపునకు అడ్డుపడుతుందా తేలిపోతుంది. 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయని, అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని వైకాపా ధీమా వ్యక్తం చేస్తోంది. కాని ఎక్కువ స్థానాలు తమకే వస్తాయని టీడీపీ ఆశపెట్టుకుంది. ఫలితాలు ఏక పక్షంగా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకే కాబోయే సీఎం ఎవరో తెలిసిపోతుంది. ప్రతి రౌండ్‌కు మెజారిటీలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటే మాత్రం వీవీప్యాట్‌ల లెక్కింపువరకు ఆగాల్సిందే.

చిత్రాలు.. చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి