రాష్ట్రీయం

నేడే కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, గురువారం ఉదయం సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం) ఓట్లను, తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తొలుత లెక్కిస్తామన్నారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉదయం 8.20 గంటల వరకు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపడతామని వివరించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్లలో నమోదైన ఓట్‌స్లిప్పులను లెక్కిస్తామని, ఈ వీవీప్యాట్లను అభ్యర్థులు లేదా వారి ఏజంట్ల ఏజంట్ల సమక్షంలో లాటరీ విధానంలో
ఎంపిక చేస్తామని వివరించారు. ఈవీఎంల ఓట్లతో వీవీ ప్యాట్ల ఓట్లు సరిపోలకపోతే రెండు లేదా మూడు పర్యాయాలు లెక్కిస్తామని వివరించారు. తుది నిర్ణయం మాత్రం రిటర్నింగ్ అధికారులదే (ఆర్‌ఓలు) నని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోదని వివరించారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 35 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుకోసం 126 హాళ్లను గుర్తించామని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక హాల్ ఉంటుందని, వీటిలో 14 టేబుళ్లు ఉంటాయని రజత్ కుమార్ వివరించారు. మల్కాజ్‌గిరిలోని మేడ్చల్, ఎల్‌బీనగర్ సెగ్మెంట్లకు 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి సెగ్మెంట్‌కు రెండు హాళ్లను ఏర్పాటు చేశామని, ఒక్కో హాల్‌లో 18 టేబుళ్ల చొప్పున మొత్తం 36 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ఏ నియోజకవర్గంలోని హాళ్లలోనైనా రీకౌంటింగ్ కావాలని అభ్యర్థులు లేదా వారి ఏజంట్లు భావిస్తే లిఖితపూర్వకంగా రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు ఇవ్వాలని రజత్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదులను మన్నించడం లేదా తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోబోదన్నారు. రిటర్నింగ్ అధికారి తన నిర్ణయాన్ని లిఖితపూర్వకంగానే తెలియచేయాల్సి ఉంటుందని వివరించారు.
భారీ భద్రత
----------
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశామని రజత్ కుమార్ తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ మీడియా సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఫలితాల వెల్లడికి డిస్‌ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు. రిటర్నింగ్ అధికారులు మినహా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే వేరెవరికైనా సెల్‌ఫోన్లను తమ వెంట తీసుకువెళ్లేందుకు అనుమతి లేదన్నారు.

చిత్రాలు.. *సీఈఓ రజత్ కుమార్
*.హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బలగాల పహారా