రాష్ట్రీయం

ప్రజాతీర్పు శిరోధార్యం: కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు శిరోధార్యమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితలపై స్పందిస్తూ గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాము మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామనుకున్నామని, అయితే కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థుల ఓటమికిగల కారణాలపై పార్టీలో చర్చిస్తామన్నారు. ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు ఓడిపోయినట్టే కవిత నిజామాబాద్‌లో ఓటమి పొందితే అందుకు కారణాలు ఏమిటన్నది తెలుసుకుంటామన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. కవిత మీద నిజామాబాద్‌లో పోటీ చేసిన వారు రైతులు కారని వారంతా రాజకీయ పార్టీల కార్యకర్తలేనన్నారు. మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటమిపాలైన చంద్రబాబు నాయుడిని ఈ రోజు విమర్శించ దలుచుకోలేదన్నారు. తమకు ఎవరితో వ్యక్తిగత కక్షలు లేవన్నారు. పొరుగు వారితో మంచి సంబంధాలు నెరపాలన్నది తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విధానమన్నారు. జగన్ నాయకత్వంలో ఏపి ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉంటాయన్నారు. జగన్‌తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు కేటీఆర్ అభినందలు తెలిపారు.
చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్