రాష్ట్రీయం

కవిత ఓటమి టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఓటమి అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఉహించని పరిణామం. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో తొలి ఓటమికి కవిత కారణం కావడాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులకు మింగుడు పడని పరిణామం. టీఆర్‌ఎస్ పార్టీ ఉహించనన్ని ఎంపీ సీట్లు దక్కక పోవడం ఒక ఎత్తు అయితే కవిత ఓడిపోవడం మరో ఎత్తు. మంచి వాగ్దాటి, అన్ని అంశాలపై లోతైన అవగాహన, జాతీయ స్థాయిలో మహిళా నాయకురాలిగా ఎదుగుతున్న క్రమంలో కవిత అపజాయం పాలు కావడం టీఆర్‌ఎస్‌కే కాకుండా కేసీఆర్ కుటుంబానికి ఉహించని షాకేనని చెప్పవచ్చు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ రాజకీయవేత్త డి శ్రీనివాస్‌ను నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో పక్కన పెట్టడం వల్ల టీఆర్‌ఎస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. పైగా కవితను ఓటమి పాలుజేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి ఆర్వింద్ స్వయానా డిఎస్ కుమారుడు కావడం విశేషం. కవితను ఓటమి పాలు చేయడం ద్వారా టీఆర్‌ఎస్ పార్టీ తన పట్ల చేసిన అవమానానికి డీఎస్ కుటుంబం ప్రతీకారం తీర్చుకున్నట్టు అయింది. ఇలా ఉండగా టీఆర్‌ఎస్ ఎంపీలలో ఏకైక మహిళా ఎంపీ కవిత ఓడిపోవడంతో ఆ స్థానాన్ని అదే పేరుగల మాలోతు కవిత భర్తీ చేసినట్టు అయింది.