రాష్ట్రీయం

లగడపాటి రెండోసా‘రీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మళ్లీ తలకిందులైంది. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ మళ్లీ అధికారాన్ని చేపడుతుందన్న ఆయన సర్వే తుస్సుమంది. అంతేకాదు టీడీపీ ఘోరాతిఘోరంగా దెబ్బతిన్నది. గత ఏడాది చివర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ సారథ్యంలోని ‘మహా కూటమి’ అధికారంలోకి వస్తుందని లగడపాటి రాజగోపాల్ సర్వేను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే లగడపాటి సర్వే కాబట్టి శాస్ర్తియబద్ధంగా ఉంటుందని అందరూ ఊహించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి ఘోరంగా దెబ్బతినడంతో రాజగోపాల్ సర్వేపై ప్రజల్లో నమ్మకం సడలింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సర్వేలోనూ లెక్క తప్పింది. ఏపీ సర్వే వెల్లడించడానికి ముందు లగడపాటి మీడియాతో మాట్లాడుతూ ఈ సర్వే విషయంలోనూ తాను విఫలమైతే ఇక భవిష్యత్తులో ప్రజలు ఎవ్వరూ విశ్వసించరని వ్యాఖ్యానించారు.