రాష్ట్రీయం

కుప్పంలో తగ్గిన బాబు బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, మే 23: చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో టీడీపీకి ఈ సారి మెజారీటీ తగ్గడం సర్వత్రా చర్చనీయాశంగా మారింది. తెలుగు దేశం పార్టీ అవిర్భావం నుంచి కుప్పం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటూ వస్తోంది. ప్రతిసారి చిత్తూరు పార్లమెంట్ స్థానం టీడీపీ గెలవడంలో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గం కీలకపాత్ర వహిస్తూ వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఈ నియోజక వర్గంలో టీడీపీకి అశించ విధంగా మెజారిటీ రాక పోవడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. గురువారం ఓట్ల లెక్కింపులో తొలి రెండు రౌండ్లలోను ఈ నియోజక వర్గంలో వైకాపా ముందజలో నిలిచి తరువాత క్రమేణా పుంజుకుది. గతంలో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ అధినేత సుమారు 47 వేల ఓట్ల మోజారిటీతో గెలవగా ఈసారి 30 వేలకుపడి పోయింది. ఈ నియోజక వర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన చంద్రవౌళికి ఆర్యోగం బాగ లేక పోవడంతో ఆసుపత్రిలోనే ఉంటున్నారు. తన కుమారుడు భరత్ ద్వారా నామినేషన్ దాఖలు చేసి కనీసం ఎన్నికల ప్రచారం లో కూ పాల్గొన లేదు, దీంతో చంద్రవౌళి భార్య, కుమారుడు నియోజక వర్గంలో ముమ్మర ప్రచారం చేశారు. నామినేషన్ల పర్వం నుంచి ఎన్నికల ప్రచారం, పోలింగ్ వ్యహారాలన్నీ స్థానిక టీడీపీ నేతలు చూసుకోవడం జరుగుతోంది. కుప్పం నియోజక వర్గంలో స్థానిక నేతల వ్యహారంగానే టీడీటీకి మెజారిటీ తగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.