రాష్ట్రీయం

స్మార్ట్ విలేజ్‌గా యాదాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: యాదాద్రి పట్టణాన్ని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేసేందుకు మూడు నెలల్లోగా అవసరమైన పనులతో ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వైటీడీఏ) సమీక్ష కమిటీ సమావేశం సీఎస్ అధ్యక్షతను బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, యాదాద్రి పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కేబుళ్లు, వీధిదీపాలు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, వాననీళ్ల ప్రవాహం పైపులు వేయడం, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్క్‌లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. యాదాద్రిలో వేదపాఠశాల నిర్మాణానికి 16 ఎకరాల దేవాదాయ భూమిని కేటాయించామని, దాంతో వేదపాఠశాల భవన నిర్మాణానికి సంబంధించిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. బస్వాపూర్ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాయగిరి, గండిచెరువు, పెద్ద చెరువు, మల్లాపూర్ చెరువు సైదాపూర్ చెరువుల అభివృద్ధి పనులను కూడా సమీక్షించారు. శిల్పకళా విద్యాసంస్థలో చదువుకుంటున్న విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సీఎస్ సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, దేవాలయ ఈఓ గీత తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...ఉన్నతాధికారులతో యాదాద్రిపై సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్. జోషి