రాష్ట్రీయం

బాసర ఆలయంలో తాగునీటి కటకట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, జూన్ 13: తెలంగాణలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు తాగునీటిని అందించలేకపోతున్నారు. భక్తుల కోసం ఆలయం తరపున వేలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన చలివేంద్రం నేడు నిరుపయోగంగా మారింది. పాఠశాలలు ప్రారంభం అవుతున్న సమయంలో భక్తులు, తమ చిన్నారులతో కలిసి వ్యయ ప్రయాసలకోర్చి అమ్మవారి చెంతకు వచ్చే వారికి కనీసం మంచి నీటిని అందించలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం 18 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న కనీస సౌకర్యాలపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించడం లేదు. అందుబాటులో మరుగుదొడ్లు లేక భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. భక్తులు ఏదైనా సమాచారం కోరడానికి వెళ్తే సమాచారం ఇవ్వడానికి అధికారులు అందుబాటులో ఉండరు.
అలంకారప్రాయంగా చలివేంద్రాలు
బాసర ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ సన్నిధిలో వంద రూపాయల అక్షరాభ్యాస మండపానికి వెళ్లే మార్గంలో, మెట్ల మార్గం గుండా ఆలయానికి దర్శనానికి వెళ్లే మార్గంలో ఆలయానికి చెందిన అతిథి గృహాలకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన చలివేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటిలో అమ్మవారి దర్శనానికి మెట్ల మార్గం గుండా వెళ్లే మార్గంలో చలివేంద్రం అలంకార ప్రాయంగా మారాయ. భక్తులు మంచినీరు తాగేందుకు వెళ్తే నీళ్లులేని కుండలు దర్శనమిస్తున్నాయి. కోట్ల ఆదాయం వస్తున్న మంచి నీటిని భక్తులకు అందించలేని దుస్థితిలో ఆలయ అధికారులు ఉన్నారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.