రాష్ట్రీయం

రూపాయకే అంతిమ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 16: పేద,మద్య తరగతి కుటుంబాల దహన సంస్కారాల ఇబ్బందులు తొలగించేందుకు కరీంనగర్ నగరంలో నూతనంగా చేపట్టిన ఒక్క రూపాయికే అంతిమయాత్ర ఆఖరీ సఫర్ కార్యక్రమం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. స్థానిక 27వ డివిజన్ భవానీనగర్‌లో కట్టరాంపూర్‌కు చెందిన మాచర్ల లలిత మృతదేహానికి పాడె కట్టి, మోసి మేయర్ రవీందర్‌సింగ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, అంతిమ వీడ్కోలు యాత్ర ఓ సామాజిక బాధ్యతగా భావించి, దేశంలోనే మొదటిసారి నగరంలో చేపట్టినట్టు వెల్లడించారు. దహన సంస్కారాలు చేయటం దైవ కార్యానికి సమానమని, పేద ప్రజల కోసం ఈ పథకానికి శ్రీకారం చుట్టి ఆచరణలో పెడుతున్నట్టు తెలిపారు. ఈ పథకానికి ఇప్పటికే రూ.1.50 కోట్లు కేటాయించగా, దాతల నుంచి కూడా భారీగానే విరాళాలు వస్తున్నాయని, వీటికోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతాను కూడా తెరిచినట్టు పేర్కొన్నారు. ఒక్కో కార్యక్రమానికి రూ.6 నుంచి రూ.10 వేల మద్య ఖర్చు వస్తుందని, సంప్రదాయంగా చేసే కార్యక్రమాలతో పాటు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళు కూడా ఏర్పాటు చేసినట్టు, కుల, మతాలకతీతంగా కార్యక్రమం నగర పాలక సంస్థ ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య పర్యవేక్షకుడు వేణుగోపాల్, జవాన్ త్యాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు సోహాన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...పాడె మోస్తున్న మేయర్ రవీందర్‌సింగ్