రాష్ట్రీయం

మహిమాన్వితం.. విశాఖ శారదా పీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 17: భవిష్యత్తును చెప్పగలిగే ఏకైక మహిమాన్విత పీఠం విశాఖ శారదాపీఠమేనని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని అమరావతి కరకట్ట మార్గంలో ఉన్న ఉండవల్లి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకార మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహనరెడ్డి, కేసీఆర్‌లు పాల్గొని నూతన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామికి కిరీటధారణ గావించారు. అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి నూతన స్వామి పూలాభిషేకం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురికీ స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించి మంగళాశాసనాలు చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి ప్రసంగిస్తూ 2024 నాటికి స్వాత్మానందేంద్ర స్వామికి పూర్తిగా పీఠాధిపతి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఆయన హిందూ ధర్మాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురికీ స్వాత్మానందేంద్ర స్వామి ఇష్టమైన వ్యక్తి అని తెలిపారు. అధర్మం ఓడి, ధర్మం గెలుస్తుందనడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విజయమే సాక్ష్యమని స్వామీజీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తును తెలియజేసే ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమేనని పునరుద్ఘాటించారు.
చిత్రాలు.. ఉండవల్లిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్రకు మాలధారణ చేస్తున్న స్వామి స్వరూపానందేంద్ర
*కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్