రాష్ట్రీయం

విద్యుత్ ఆదాలో ఆదర్శం ఆంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: విద్యుత్ ఆదా చేయడంలో దేశంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు రాజస్థాన్ విద్యుత్ అధికారుల బృందం హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం ఆంధ్రరాష్ట్రంలో విద్యుత్ ఆదాను సమర్ధంగా అమలు చేస్తున్న ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఈ వివరాలను ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. విద్యుత్ ఆదా స్కీంను అమలు చేస్తే దేశం మొత్తం మీద సాలీనా ఒక లక్ష ఎంయు విద్యుత్‌ను ఆదా చేయవచ్చని, 40 వేల కోట్ల నిధులు మిగులుతాయని అజయ్ జైన్ తెలిపారు. ఆంధ్రాను మోడల్‌గా తీసుకుని విద్యుత్ ఆదా స్కీంలు అమలు చేయాలని కేంద్రం హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కోరింది. ఇందులో భాగంగా జైపూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ ఎండి, చైర్మన్ భాస్కర్ ఏ సావంత్ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్‌ను కలిశారు. ఏపిలో విద్యుత్ పరిస్ధితిని అజయ్ జైన్ రాజస్థాన్ బృందానికి వివరించారు. రైతులకు ఉచితంగా వ్యవసాయపంపుసెట్లను ఏర్పాటు చేయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం అవతరించిన సమయంలో 22 ఎంయు విద్యుత్ కొరత ఉండేదని, ఇప్పుడు బాలారిష్టాలను దాటి మిగులు విద్యుత్ స్థితికి చేరుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 15 లక్షల పంపుసెట్లను 2019 మార్చి లోపల అమర్చుతామని, దీనికి రూ. 5000 కోట్లు ఖర్చవుతుందన్నారు. 2013-14లో విద్యుత్ పంపిణీ నష్టాలు 17 శాతం ఉండగా, ఇప్పుడు 10.34 శాతానికి తగ్గినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా పరిస్థితిని వినియోగదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక యాప్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇ- ఆక్షన్ ద్వారా స్వల్పకాలిక విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఈ విధానాన్ని తొలుత అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సలహాదారు రంగనాథం తదితరులు పాల్గొన్నారు.
బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన రాజస్థాన్‌లోని జైపూర్ విద్యుత్ విట్న్ నిగమ్ లిమిటెడ్ సిఎండి భాస్కర్ ఎ సావంత్‌తో తదితరులతో ఏపి ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి అజయ్ జైన్ తదితరులు

- ఓటుకు నోటు కేసు -
మత్తయ్య పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఓటుకునోటు కేసులో తనను నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ జెరూసలేం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావువిచారించారు. ఈ విచారణకు ఎవరినీ అనుమతించలేదు. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయని, తీర్పును త్వరలో వెల్లడించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే ఏసిబి దర్యాప్తు జరిపి చార్జిషీటును కూడా దాఖలు చేసిందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.
‘మహిళలు లేని మంత్రివర్గం’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించాలని టిటిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు సిఎం చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. మహిళలు లేని మంత్రివర్గం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విశ్వాసం లేదని ఆయన విమర్శించారు. మహిళల పట్ల, దళితుల పట్ల వివక్ష చూపిస్తున్న ముఖ్యమంత్రిపై అంటరానితనం కింద కేసు పెట్టాలని అన్నారు. జగ్జీవన్‌రాం జయంతి రోజున విగ్రహానికి పూలదండ వేసే ఓపిక కెసిఆర్‌కు లేదని, జ్యోతిరావుపూలే జయంతి రోజున నివాళి అర్పించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా దళితునే్న చేస్తామన్న హామీని కెసిఆర్ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఈ నెల 14న ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకూ ర్యాలీ నిర్వహించి ఒక రోజున ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు మోత్కుపల్లి వివరించారు.

రూ. 161 కోట్లతో
రోడ్ల అభివృద్ధి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: రానున్న కృష్ణా పుష్కరాలకు రోడ్ల వెడల్పు, అభివృద్ధి చేసేందుకు గాను కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు రూ.161.38 కోట్లు మంజూరు చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాలో 14, గుంటూరు జిల్లాలో 46, కర్నూలులో 7 పనులను చేపట్టేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.6.80 కోట్లతో పాలకొల్లులో ఎన్టీఆర్ కళాక్షేత్రం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో రూ.6.80 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి పుష్కరాల్లో భాగంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు పురపాలక శాఖ డైరక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అనుమతి
ఎపిపిఎస్‌సి నిర్వహించే పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఎపి ఆన్‌లైన్‌తో అనుమతించిన ధరలకు లోబడి అవగాహన ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి తప్పిదాలు, అక్రమాలు, కాపీయింగ్‌కు అవకాశం లేని విధంగా కంప్యూర్ ఆధారిత పరీక్షల నిర్వహణకు ఎపి ఆన్‌లైన్‌ను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.

దేవిప్రసాద్‌కు మెమోను కొట్టివేసిన క్యాట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త ఆదాయం పన్ను శాఖ కమిషనర్ ఉప్పులేటి దేవిప్రసాద్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం, 2014 ఎన్నికల్లో కల్పన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఆయనకు జారీ చేసిన చార్జి మెమోను కొట్టివేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. తనకు దురుద్దేశపూర్వకంగా మెమో ఇచ్చారని దేవిప్రసాద్ క్యాట్‌లో దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. టిడిపి నేత వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆదాయం పన్ను శాఖ ఈ మెమోను ఇచ్చినట్లు కనపడుతోందని క్యాట్ బెంచి పేర్కొంది.