తెలంగాణ

మహిళలు లేని మంత్రివర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించాలని తెలంగాణ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును డిమాండ్ చేశారు. మహిళలు లేని మంత్రివర్గం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విశ్వాసం లేదని ఆయన విమర్శించారు. మహిళల పట్ల, దళితుల పట్ల వివక్ష చూపిస్తున్న ముఖ్యమంత్రిపై అంటరానితనం కింద కేసు పెట్టాలని అన్నారు. జగ్జీవన్‌రాం జయంతి రోజున విగ్రహానికి పూలదండ వేసే ఓపిక కెసిఆర్‌కు లేదని, జ్యోతిరావుపూలే జయంతి రోజున నివాళి అర్పించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా దళితునే్న చేస్తామన్న హామీని కెసిఆర్ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా ఈ నెల 14న ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకూ ర్యాలీ నిర్వహించి ఒక రోజున ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు మోత్కుపల్లి వివరించారు.
అడవుల్లో మూగజీవాలకు
తాగునీరు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలోని అభయారణ్యంలో సంచరించే మూగ జీవాల కోసం రాష్ట్రప్రభుత్వం మంచినీటి సదుపాయం కల్పించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోంది. కనీవినీ ఎరుగని కరవువల్ల అడవుల్లోని చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. దీంతో మూగ జీవాలు తాగేందుకు నీరు లభించక అల్లాడుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన అటవీ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటి కుంటలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏటూరు నాగారం, కవాల్, ఆమ్రాబాద్ అభయారణ్యాల్లో ఎంపిక చేసిన ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని నీటి కుంటల వద్ద సౌరశక్తితో నడిచే పంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టు వద్ద ఫర్హాబాద్, ఆదిలాబాద్ జిల్లా కవాల్ టైగర్ ప్రాజెక్టు వద్ద సౌరశక్తితో నడిచే బోర్లను ఏర్పాటు చేశారు. మరోరెండు ఈ తరహా బోర్లను ఏర్పాటు చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కనీసం వచ్చే 30 రోజుల పాటు ఈ సదుపాయం కల్పించేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేస్తోంది. రాజధానిలోని జూలో కూడా మూగజీవాలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా వేసవి తాపం తగలకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
-- ఓటుకు నోటు కేసు --
మత్తయ్య పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 13: ఓటుకునోటు కేసులో తనను నిందితుడిగా చేర్చడాన్ని సవాలు చేస్తూ జెరూసలేం మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావువిచారించారు. ఈ విచారణకు ఎవరినీ అనుమతించలేదు. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయని, తీర్పును త్వరలో వెల్లడించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే ఏసిబి దర్యాప్తు జరిపి చార్జిషీటును కూడా దాఖలు చేసిందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె రవీంద్రకుమార్ తన క్లయింటు మత్తయ్య పెట్టుకున్న పిటిషన్ ప్రకారం కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు.