రాష్ట్రీయం

ముగిసిన బాబు విదేశీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విజయవాడ: ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చాలనుకోవడం సరైన ఆలోచన కాదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వారం రోజుల పాటు తన కుటుంబ సభ్యులతో యూరోప్ పర్యటనకు వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లో తన నివాసంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, పార్టీలో జరిగిన వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. కాగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసే విషయమై టీటీడీపీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో మంగళవారం ఇక్కడ చర్చించారు. శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు విమానాశ్రయంలో టీటీడీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్రతినిధులు అరవింద్‌కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి పాల్గొన్నారని పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు.
చిత్రం...శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టీడీపీ నేతలు