రాష్ట్రీయం

మసీదుల పైనా ఇలాగే స్పందిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: కొన్ని హిందూ దేవాలయాల్లోకి మహిళలను అనుమతించే విషయమై కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు హిందూ ధార్మిక వేత్తలతో కమిటీలు నియమించి వారి అభిప్రాయాన్ని తీసుకుంటే బాగుండేదని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. మహమ్మదీయ మతానికి చెందిన మహిళలను మసీదుల్లోకి అనుమతించాలా వద్దా అనే విషయమై కూడా కోర్టులు ఇదే విధంగా తీర్పులు ఇస్తాయా అని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ శనిసింగనాపూర్‌లో మహిళల ప్రవేశంపై కోర్టు అనుమతి ఇచ్చే ముందు హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే హిందూమతానికి దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతుందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని, 125 కోట్ల మంది భారతీయులు అంబేద్కర్ వారసులన్నారు. అంబేద్కర్ అందరి వాడన్నారు. ప్రతి భారతీయుడు ఏప్రిల్ 14వ తేదీన ఆలయాలకు వెళ్లి అంబేద్కర్ పేరిట పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని, పండ్లను రోగులకు, పేదలకు, వృద్ధులకు, అనాథలకు పంచి పెట్టాలన్నారు. ఒక వర్గానికి చెందిన నేతగానే అంబేద్కర్‌ను చూసే దృష్టిని విడనాడాలన్నారు. తమ పీఠం తరఫున గురువారం దుర్గ్భాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో అంబేద్కర్ పేరిట పండ్లను రోగులకు పంపిణీ చేస్తామన్నారు. అలాగే భారత్‌మాతాకీజై అనే నినాదాన్ని వివాదస్పదం చేయడం తగదన్నారు. భారత జాతీయ పతకాన్ని చూస్తే వెంటనే గౌరవభావం కలుగుతుందని, అలాగే భారత్‌మాతాకీ జై అంటే దేశ భక్తి ఉప్పొంగుతుందన్నారు. ఈ నినాదం నేను చేయను అని ఒక నేత అనడం సరికాదని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లో బుధవారం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పరిపూర్ణానంద స్వామి
శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిజీ