రాష్ట్రీయం

వైభవంగా ముగిసిన శాకంబరి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ : వరంగల్ భద్రకాళి దేవాలయంలో గత 15 రోజులుగా వైభవంగా జరిగిన శాకాంబరి ఉత్సవాలు మంగళవారంతో ముగిసాయి. ఈ రోజు ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి పూజలు చేశారు. వేలాది మంది భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనానికి దేవస్థానం అనుమతించగానే భక్తులు ఒక్కసారిగా గుడిలోపలకి వచ్చి శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు. దేవస్థానం ప్రాంగణం అంతా భద్రకాళి శరణం మమ శాకాంబరీ మాతాకీ జై అనే నామస్మరణలతో మారుమోగింది. ఆలయ ఈవో సునీత, పోలీసులు, ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో జరిపిన ఏర్పాట్లు భక్తుల ప్రశంసలకు పాత్రమయ్యాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 4 టన్నుల కూరగాయలు, పండ్లు వరంగల్, హైదరాబాద్, బెంగళూరు నుండి తెప్పించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెల్లవారుజామున ఒంటి గంటకు ప్రారంభమైన అలంకరణ ఉదయం 7గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటల పూజానంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మూర్తి రహస్యంలో 12వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు ఈ శాకాంబరి ఆరాధన విశేషంగా వివరించి ఉంది. ఈ శాకాంబరి దేవీ నీల వర్ణం కలిగి కమలాసనముపై సుందరముగా నుండి తన చేతుల యందు వరిమొలకలు, పుష్పములు, చిగురుటాకులు, దుంపగడ్డలు తదితర కూరగాయల సముదాయమును ధరించి ఉంది. ఈ శాఖ సముదాయములు అంతులేని కోరికలను తీర్చు రసములు గలవై జీవులకు కలుగు ఆకలి దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరము తదితర వాటిని పోగొడుతుంది. ఉమా, గౌరీ, సతీ, చండీ, కాళిక, పార్వతీ అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది. ఈ శాకాంబరి దేవిని భక్తితో ధాన్యం చేయువారు, నమస్కరించు, జపించు, పూజించువారు, తరిగిపోని అన్న, ప్రాణ, అమృతములను అతిశీఘ్రముగా పొందుతారని మూర్తి రహస్యంలో ఉంది. శాస్త్రాలలో ఈ శాకంబరీ మహాత్యం వివరింపబడి ఉండటం వలన ఈ శాకాంబరి ఆరాధన బహుళ జనాదరణ పొందింది. కాగా మంగళవారం అర్ధరాత్రి 1.30 నిమిషాలకు సంభవించే చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని సాయంత్రం ఆరుగంటలకే ఆలయాన్ని మూసివేశారు. తిరిగి బుధవారం సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం పునరుద్ధరిస్తారు.

చిత్రం...శాకంబరిగా అలరిస్తున్న భద్రకాళి అమ్మవారు