రాష్ట్రీయం

అడ్డా కూలీ కన్నా ఘోరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలోని సాంకేతిక వృత్తివిద్యా సంస్థల్లో పనిచేస్తున్న బోధన సిబ్బంది పరిస్థితి అడ్డాకూలీ కంటే ఘోరంగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం సిబ్బందికి సరైన వేతనాలు, సర్వీసు రక్షణ, నియమనిబంధనలు
లేకపోవడం, చెప్పేది ఒక జీతమైతే, చేతికిచ్చేది మరో జీతం కావడంతో ఉన్నత చదువులు పూర్తి చేసినా యాజమాన్యాల చేతుల్లో దగాకు గురవుతున్నారు. రికార్డుల కోసం ఆన్‌లైన్‌లో ఎక్కువ వేతనం ఇస్తున్న యాజమాన్యాలు తర్వాత వారి నుండి వెనక్కి తీసుకుంటున్న పరిస్థితులూ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఫార్మసీ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాల సమస్య చాలా తీవ్రమైన అంశంగా తయారైంది. కొన్ని యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ సాకుతో సరైన సమయంలో వారికి వేతనాలు చెల్లించడం లేదు. కొన్ని కాలేజీలు ఆరేడు నెలలైనా వేతనాలు ఇవ్వడం లేదు, వేరే ఉద్యోగాలకు వెళ్దామన్నా యాజమాన్యాలు సిబ్బంది సర్ట్ఫికెట్లను తమ వద్ద పెట్టుకుని కాంట్రాక్టు రాయించుకుంటున్నాయి. వాస్తవానికి ఏఐసీటీఈ హ్యాండ్‌బుక్‌లో విద్యార్థులు లేదా టీచర్ల ఒరిజనల్ సర్ట్ఫికేట్లను ఉంచుకోవడానికి వీలు లేదు, కానీ ఆ నిబంధనలను తోసిరాజని యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగుల పరిస్థితి దినదినగండంగా నూరేళ్ల ఆయుష్షుగా తయారైంది. ఇద్దరు యూనివర్సిటీ అధికారులు, ఇద్దరు సబ్జెక్టు నిపుణులు, ఇద్దరు ఎక్స్‌పర్ట్సు, సంబంధిత కాలేజీ హెచ్‌ఓడీ , ప్రిన్సిపాల్‌తో కలిసి సుమారు ఎనిమిది మంది ప్యానల్ ద్వారా విద్యార్హతలు, సబ్జెక్టులో పరిజ్ఞానాన్ని , సర్ట్ఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నియామక ప్రక్రియ చేపట్టినా చివరికి ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాల నియామకంలో శ్రద్ధవహించే యూనివర్సిటీ, ఉద్యోగులను తొలగించినపుడు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. యూజీసీ -2018 నిబంధనల ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సిబ్బందికి ఒకే వేతనం, అలవెన్స్‌లు చెల్లించాల్సి ఉంటుంది, కానీ ప్రైవేటు సిబ్బందికి మాత్రం సకాలంలో అలవెన్స్‌లు ఇవ్వడం లేదు. జేఎన్‌టీయూ విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో ఒకే రకమైన సర్వీసు రూల్స్‌ను రూపొందించి వాటిని గవర్నింగ్ బాడీలో అప్రూవల్ తీసుకుని ఆ రూల్స్‌ను యూనివర్సిటీలో ఒక కాపీ దాఖలు చేయడంతో పాటు అందరు ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా ప్రతి ఉద్యోగికీ ఒక కాపీ ఇవ్వాలని చెప్పినా దానిని పాటించడం లేదు. ఉద్యోగులకు గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్‌ను అమలుచేయాలని, సెలవుదినాలను అమలుచేయాలని, క్యాడర్ నిష్పత్తిని పాటించాలని, ఓవర్‌టైమ్ పనిచేయించడం తగదని తెలంగాణ టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్ ఎంప్లాయాస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వీ బాలకృష్ణరెడ్డి పేర్కొన్నారు. సిబ్బందికి ఎగ్జామ్ రెమ్యూనిరేషన్ ఇవ్వాలని, బయోమెట్రిక్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాలని, బోధనేతర సిబ్బందికి సైతం ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన కోరారు.