రాష్ట్రీయం

నేటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: మున్సిపల్ కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా నిర్వహిస్తోన్న శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ రెండు రోజులు, శాసనమండలి ఒకే రోజు సమావేశం కానుంది. సభలో మొదటి రోజు గురువారం మున్సిపల్ బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రవేశపెడతారు. మున్సిపల్ శాఖను కూడా సీఎం కేసీఆరే నిర్వహిస్తుండటంతో బిల్లును సభలో ఆయనే ప్రవేశపెడతారు. మొదటి రోజు సభలో మున్సిపల్ బిల్లు ప్రవేశ పెట్టడంతో పాటు బిల్లులోని ముఖ్య అంశాలను సభకు సీఎం వివరించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా బిల్లును సభ్యలు అధ్యయనం చేశాక మరుసటి రోజు శుక్రవారం సభలో బిల్లుపై అన్ని పక్షాలు చర్చిస్తాయి. చర్చ అనంతరం బిల్లు ఆమోదం పొందనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు శాసనసమండలిలో కూడా ఈ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశ పెడతారు. అక్కడ కూడా ఆమోదం పొందాక ఉభయ సభలు అమోదించిన చట్టాన్ని గవర్నర్ పరిశీలనకు పంపిస్తారు. గవర్నర్‌కు ఆమోదంతో మున్సిపల్ చట్టంపై గెజిట్ విడుదల అవుతుంది. ఈ రెండు రోజుల సమావేశాలు ప్రత్యేకంగా మున్సిపల్ బిల్లు
ఆమోదం కోసం నిర్వహిస్తుండటంతో సభలో ప్రశ్నోత్తరాలు, ఇతర ప్రోసీడింగ్స్ ఏవీ ఉండవని ఇదివరకే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల శాసనసభ సమావేశాల ఏర్పాట్లు, బందోబస్తుపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి వేదాంతాచారి తదితరులు బుధవారం ఉదయం తన చాంబర్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో సమావేశమై చర్చించారు.