రాష్ట్రీయం

గవర్నర్‌తో కేసీఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో గురువారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. నరసింహన్ ఇంతకాలం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా మరో గవర్నర్‌ను కేంద్రం ప్రకటించిన తరువాత నరసింహన్‌తో కేసీఆర్ భేటీ కావడం ఇదే తొలిసారి. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి కూడా త్వరలో కొత్త గవర్నర్‌ను నియమించనున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ఆయన్ను కలవడం ప్రాధాన్యతను సంచరించుకుంది. అయితే అలాంటిదేమి లేదు, శాసనసభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా గవర్నర్‌తో సీఎం భేటీ కావడం అనవాయితీగా వస్తుందని, ఈ కారణంగానే కలిసారని సీఎంఓ వర్గాలు అంటున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చే అవకాశం ఉందా? అనే విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ ఆరా తీసినట్టు తెలిసింది. కేంద్ర హోం శాఖ సలహాదారుగా (జమ్మూ-కాశ్మీర్) నరసింహన్‌ను నియమించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా బీజేపీ వర్గాల సమాచారం. ఇలా ఉండగా శాసనసభ రెండు రోజుల సమావేశం, కొత్త మున్సిపల్ చట్టంతో పాటు ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొచ్చిన చట్టాలు తదితర అంశాలను భేటీ సందర్భంగా గవర్నర్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది. అలాగే కొత్త సచివాలయం, శాసనసభ సముదాయం నిర్మాణాలు దీనిపై హైకోర్టులో కేసు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.
చిత్రం...గవర్నర్ నరసింహన్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్