రాష్ట్రీయం

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ టిడిపిలో చేర్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ద్రోహి అని ప్రతిపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్న చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి హాని చేసే విధంగా చంద్రబాబు చర్యలు ఉన్నాయని ఆయన దుమ్మెత్తిపోశారు. గురువారం ఇక్కడి లోటస్‌పాండ్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి జగన్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపిలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఆ తర్వాత ఎన్నికలకు సిద్ధపడాలన్నారు. అంబేద్కర్ పేరును ఉచ్చరించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు.
ఆంధ్రలో గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు వీలుగా వెంటనే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలన్నారు. అప్పుడే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలోని ఏడు ఎస్టీ సీట్లలో ఆరు సీట్లను వైకాపా గెలుచుకోవడంతో చివరకు గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితికి టిడిపి ప్రభుత్వం చేరుకుందన్నారు. క్రైస్తవాన్ని స్వీకరించిన దళితులకు కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వడంలేదన్నారు. ఈ విషయమై చంద్రబాబు నిశ్శబ్దంగా ఉండడం ఎందుకన్నారు. చంద్రబాబు పచ్చి అవకాశ వాది అని సమయానుకూలంగా నైతిక విలువల గురించి మాట్లాడుతూ ఆచరణకు వచ్చే సరికి తుంగలో తొక్కుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు విడుదల చేసి అభివృద్ధికి ఖర్చుపెట్టాలన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు దేశంలో బడుగు వర్గాలకు రక్షణ ఉందన్నారు.
జగన్‌తో ముస్లిం నేతల భేటీ
ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో జమాత్ ఉలేమా హింద్ అనే సంస్థకు చెందిన ముస్లిం నేతలు జగన్‌ను కలిసి మద్దతు అడిగారు. వైఎస్ కల్పించిన మైనార్టీ రిజర్వేషన్ల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలకు ప్రయోజనం కలిగిందన్నారు.