రాష్ట్రీయం

నకిలీలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రైతుల పంట రుణాల మాఫీ కోసం రూ.17 వేల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులలో అనర్హుల వడపోత చర్యల్ని చేపట్టింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు పంట రుణాన్ని మాఫీ చేసి ఇప్పటికే రెండు వాయిదాలు బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం అనర్హులైన వారిని గుర్తించడానికి రెవిన్యూ శాఖ, బ్యాంకర్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తప్పుడు పత్రాలతో పంట రుణాలు పొందిన వారిని గుర్తించేందుకు వారి ఆధార్ కార్డుల సీడింగ్ చేస్తోంది. ఇప్పటికే కార్డుల సీడింగ్ 93 శాతం పూర్తి అయింది. రాష్టవ్య్రాప్తంగా పంట రుణాల ఖాతాలు 72 లక్షల ఉండగా, వీటిలో ఇప్పటికే 68 లక్షల ఖాతాలను ఆధార్‌తో అనుసంధించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి భూపరిపాలన శాఖ ఒక మొబైల్ యాప్‌ను తయారు చేసి దానిని వెబ్‌లాండ్ పోర్టల్‌లో పట్టాదార్లకు ఆధార్‌ను అనుసంధానం చేసింది. ఆధార్‌తో పాటు రుణ చార్జ్ విధానాన్ని కూడా రెవిన్యూశాఖ బ్యాంకర్లకు అందుబాటులోకి తెచ్చింది. రుణ చార్జ్ విధానంతో పంట రుణం పొందిన భూ యజమాని, లబ్ధిదారున్ని ఆన్‌లైన్‌లో స్థితిని తనఖీ చేయవచ్చు. అలాగే రైతుకు చెందిన పహాని రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (పట్టాదారు పాసు పుస్తకం) రికార్డులను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. రుణ చార్జ్‌తో రైతు ఇతర బ్యాంకుల నుంచి పొందిన బహుళ రుణాలను కూడా పసిగట్టవచ్చు. పంట రుణాలను పరిశీలన కోసం రైతులు తిరిగి ఎలాంటి డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఖరీఫ్ సీజన్‌లో (2015) కోటి 70 లక్షల పంట రికార్డులను రెవిన్యూశాఖ నమోదు చేయగా, వాటిలో రబీ సీజన్‌కు కోటి 54 లక్షల పంట రికార్డులు నమోదు అయ్యాయి. వీటి ఆధారంగా కూడా రుణ మాఫీ పరిధిలోకి వచ్చే రైతుల రుణాలు రీషెడ్యూల్ అయిందీ లేనిదీ ప్రభుత్వం, బ్యాంకర్లు తెలుసుకునే అవకాశం కలిగింది.
వడపోతతో రూ.వెయ్యి కోట్లు ఆదా
రాష్టవ్య్రాప్తంగా పంట రుణాలు పొందిన రైతులు 72 లక్షల మంది ఉండగా, ఇందులో ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పరిధిలోకి 33 లక్షల మంది వచ్చారు. వీరిలో ఒక్కో రైతు కుటుంబానికి లక్షల రూపాయలకు మించకుండా పంట రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది. మాఫీ చేసిన రుణం మొత్తం దాదాపు రూ. 17 వేల కోట్లు కాగా, దీనిని రూ. 4250 కోట్ల చొప్పున నాలుగు విడతల్లో బ్యాంకర్లకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇప్పటికే రూ. 8000 కోట్లను ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లించింది. తీసుకున్న రుణాన్ని మాఫీ చేసే నాటికే రైతులు బ్యాంకులకు చెల్లించినట్టు అయితే ఆ మొత్తాన్ని రైతుల తిరిగి పొందవచ్చు. రుణాన్ని చెల్లించనట్టు అయితే ఆ మొత్తాన్ని వడ్డీతో సహా బ్యాంకర్లకు తిరిగి రాబట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే రుణ మాఫీలో ఉన్న లొసుగుల వల్ల కొందరు రైతులు బహుళ ప్రయోజనం పొందడంతో పాటు రుణ మాఫీకి అర్హులు కానీ వారికి కూడా లబ్థికలిగింది. అలాంటి అనర్హులను గుర్తించేందుకు పంట రుణాల ఖాతాలను ప్రభుత్వం వడబోస్తుంది. ఆధార్‌తో పంట రుణాలను అనుసంధానం చేసిన తర్వాత ప్రభుత్వానికి రూ. వెయ్యి కోట్ల దాకా ఆదా అయినట్టు అధికార వర్గాల సమాచారం. రుణ మాఫీని కాజేయడానికి కొందరు రైతులు వేర్వేరు బ్యాంకుల నుంచి పొందిన రుణాలను గోప్యంగా ఉంచారు. దీనివల్ల ఒక్కో కుటుంబం లక్ష రూపాయల కంటే ఎక్కువ మాఫీ పొందిన ఖాతాలు వడబోతలో బయటపడ్డాయి. దీని వల్ల ప్రభుత్వం మొదట అంచన వేసిన రుణ మాఫీ మొత్తం రూ. 17 వేల కోట్లు కాకుండా రూ. 16 వేల కోట్లకు తగ్గింది. దీంతో ప్రభుత్వానికి వెయ్యి కోట్ల భారం తగ్గింది. పూర్తి స్థాయిలో రుణ చార్జ్, ఆధార్ సీడింగ్ జరిగితే మరో వెయ్యి కోట్ల వరకు ప్రభుత్వంపై భారం తగ్గే అవకాశం లేకపోలేదని అధికారులు అంచన వేస్తున్నారు.