రాష్ట్రీయం

కథలు చెప్పొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఏప్రిల్ 16: ప్రభుత్వం మారి రెండు సంవత్సరాలైనా అధికారులు తమ పనితీరు మార్చుకోలేదని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయని వారిపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. శనివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తొలుత కనుమళ్ల చెరువులో 10.50గంటలకు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదే చెరువులో నీరు- చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రొక్లైయిన్ ఎక్కి మట్టిని తవ్వి ట్రాక్టర్‌లో వేశారు. తదుపరి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో గల ఏడు నదుల పరివాహక ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచించారు. ఆ చెక్‌డ్యామ్‌లకు గేట్లు ఏర్పాటు చేసి చెక్‌డ్యామ్ నిండిన తదుపరి ఇతర చెక్‌డ్యామ్‌లకు వెళ్లేలా చూడాలన్నారు. తద్వారా భూగర్భజలాలను పెంపొందించుకోవచ్చునన్నారు. మొదటి విడత ప్రారంభించిన పలు చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనుల గురించి అధికారులను ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. సమీక్ష నిర్వహించినప్పుడు కథలు చెబుతూ పనులు మాత్రం నత్తనడకన చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పనులను వేగవంతం చేయాలని, కాలక్షేపం చేస్తే ఊరుకోనని ఇరిగేషన్ ఇఇపై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల రాత్రివేళ, తెల్లవారుజామున పనులు చేసుకోవాలని కూలీలకు ముఖ్యమంత్రి సూచించారు. అనంతరం కాన్వాయ్ బయలుదేరి వెళ్లి బైపాస్ సమీపంలో ఉన్న రాయకొండయ్య పొలంలో ఫారంపాండ్ గుంటలను ప్రారంభించారు. అనంతరం రూ.13కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. కొండపి మార్కెట్‌యార్డులో రూ.70లక్షలతో నిర్మించిన రైప్లింగ్ ఛాంబర్స్‌ను ఆయన ప్రారంభించారు. సింగరాయకొండలో 308 మీటర్ల గల సిమెంట్ రోడ్డును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.

చిత్రం కనుమళ్ల చెరువులో పొక్లయినర్ నడుపుతున్న సిఎం చంద్రబాబు.