రాష్ట్రీయం

మావోయిస్టుల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 16: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలో ఇటీవల ప్రొక్లెయినర్ల దగ్ధానికి పాల్పడిన మావోయిస్టులు తాజాగా తాడ్వాయి మండలకేంద్రంలో శుక్రవారం రాత్రి అటవీశాఖకు చెందిన జీపు, గుడిసెను దగ్ధం చేశారు. ఆ సంఘటన స్థలంలో ఒక లేఖను కూడా వదిలివెళ్లారు. హరితహారం పేరుతోఆదివాసుల భూములు, పీడిత వర్గాల ప్రజల భూములను లాక్కోవడం ప్రభుత్వం మానుకోవాలని ఆ లేఖలో మావోలు హెచ్చరించారు. ఆదివాసుల భూములను లాక్కుంటే ఖతం చేస్తామని హెచ్చరించారు. ఓపెన్ కాస్టులను ప్రభుత్వం విరమించుకోవాలని, టైగర్ ఎటూరునాగారం ప్రాజెక్ట్ ప్రతిపాదన విరుమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయని ఇంటలిజెన్స్ అధికారులు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం కూడా చేశాయి. ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో మావోల కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. తాజా సంఘటన పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఈ సంఘటనను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఇదిలాఉండగా ఈసంఘటనకు బాధ్యునిగా భావిస్తూ మావోయిస్టు నేత, కేకేడబ్ల్యు కార్యదర్శి దామోదర్‌సహా మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

చిత్రం తాడ్వాయి మండలంలో మావోలు దగ్ధం చేసిన అటవీశాఖకు చెందిన జీపు, గుడిసె