రాష్ట్రీయం

గోవుల మృతి వెనుక కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విజయవాడ శివారు కొత్తూరు-తాడేపల్లి గోశాలలో 110 గోవులు మృత్యువాత పడటం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని హైదరాబాద్‌లోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. గోశాలలో గత శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 110 వరకు గోవులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం పార్టీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌తో కలిసి గోశాలలో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ గోవుల మృతి అత్యంత బాధాకరమన్నారు. దీనివెనుకు కుట్ర ఉందన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బీజీపీ నగర అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ నిర్వాహకులు చెబుతున్నట్లు విషాహారం తింటే రెండు లేదా మూడు రోజులు చికిత్స చేస్తే మామూలు స్థితికి చేరుకుంటాయన్నారు. అయితే అలాకాకుండా ఒకేసారి పెద్దసంఖ్యలో ఆవులు ముక్కుల్లో రక్తస్రావం జరిగి చనిపోయాయంటే కుట్ర పూరితంగా విష ప్రయోగం జరిగి ఉంటుందన్నారు. అక్రమంగా గోవులను తరలించే గోమాంస వ్యాపారులకు ఈ కుట్రలో భాగం ఉండవచ్చన్నారు. శ్రావణ శుక్రవారం ఒకేసారి ఇన్ని గోవులు చనిపోవటం రాష్ట్రానికి అరిష్టమని... పైగా వీటిని ఖననం చేసే విషయంలో కూడా శాస్తబ్రద్ధగా వ్యవహరించలేదన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. గోసంరక్షణ కోసం కేంద్రం నుంచి నిధులు రప్పిస్తామన్నారు. వీరి పర్యటనలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వల సుబ్బయ్య, పీయూష్ దేశాయ్, బి శ్రీ్ధర్ తదితరులు ఉన్నారు. ఇలాఉంటే గోవుల మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అజీర్తితోనే మరణించాయి.. ఆవుల పొట్టలో గడ్డి తప్ప మరేమీ లేదని పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. గడ్డి అరగకపోవటంతో టాక్సిసిటీ కల్గిందని వైద్యులు చెబుతున్నారు. కాగా గోశాలలో కన్పిస్తున్న హృదయ విదారక దృశ్యాలు కంట తడిపెట్టిస్తున్నాయి.
చిత్రం...గోశాలను పరిశీలిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు