రాష్ట్రీయం

తప్పుల తడకలతో రైల్వే టైమ్ టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చుతున్న దక్షిణ మధ్య రైల్వే టైమ్ టేబుల్స్‌ను చూసి ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. టైమ్ టేబుల్స్‌లోని తప్పులు గుర్తించి, రోజూ రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
కొత్త రైళ్లు ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న రైళ్లను పొడిగించడం, రద్దీ స్టేషన్ల గుర్తించిన వాటిపై టైమ్ టేబుల్స్‌ను ప్రకటించడం జరుగుతోంది. రైళ్ల ప్రయాణ సమయాలను ఏడాదికి ఒకసారి బుక్‌లెట్‌ను ప్రకటిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 1న రైళ్ల ప్రయాణ సమయాలను తెలుపుతూ ప్రకటనలు చేశారు. రైళ్ల సమయాలను ప్రకటించే ముందు వెనకా చూడకుండా సమయాలను ప్రకటించేశారు. ఈ బుక్‌లెట్లలో రైళ్ల సమయాల్లో తప్పులు దొర్లాయి. ఏ రైలు ఎప్పుడు వస్తుందో, ఏ రైలు ఎప్పుడు వెళుతుందో చెప్పే టైమ్ టేబుల్స్‌లో చూపిస్తున్న వివరాలు ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్వాకంతో తమ ప్రయాణ సమయం వృథా అవుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి రోజూ 157 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమయాల్లో గంటల సమయం తేడాలు ఉన్నాయి. కొన్ని రైళ్లు రోజూ నడుస్తున్నాయని టైమ్ టేబుల్స్‌లో ప్రకటించారు. అయితే ఆ రైళ్లు వారానికి మూడుసార్లు రాకపోకలు సాగిస్తున్నాయి. న్యూఢిల్లీ నుంచి తిరుపతి వెళ్లే ఏపీ సంపర్క్ ఎక్స్‌ప్రెస్ రైలు రోజూ నడుస్తుందని టైమ్ టేబుల్స్‌లో ప్రకటించారు. ఆ రైలు వారానికి మూడు రోజులు నడుస్తుంది. హైదరాబాద్ - హౌరా వెళ్లే రైలు రాకపోకల్లో తేడాలు ఉన్నాయి. టైమ్ టైబుల్స్‌లో వెళ్లేది ఉదయం 10.20 గంటలకు సూచిస్తోంది. ఆ రైలు ఉదయం 9.50 గంటలకు వెళుతుందని ప్రకటనలో సూచిస్తోంది. హైదరాబాద్ నుంచి బీజాపూర్‌కు వెళ్లే రైలు రాత్రి 7.45 గంటలకు చూపిస్తుంది. అయితే వచ్చేది ఎన్ని గంటలకు అన్న సమాచారం లేదు. బీదర్- హైదరాబాద్ వెళ్లే రైలు ఎన్ని గంటలకు చూపించకుండా వచ్చేది 10.25 గంటలకు చూపిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా టికెట్లు రిజర్వు చేసుకోవాలంటే టైమ్ టేబుల్స్‌లో రైళ్ల రాకపోకలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సీజన్ల వారీగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటన చేస్తుంటారు. అయితే ఆ గడువు దాటినా అదే ప్రకటనను మీడియాకు విడుదల చేయడం గమనార్హం.