రాష్ట్రీయం

నేత్రపర్వంగా వినాయకస్వామి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 10: శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కల్యాణం మంగళవారం రాత్రి నేత్రపర్వంగా సాగింది. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం తరువాత నూతన వధూవరులతో కలసి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు. ఆనవాయితీ ఉత్సవానికి బొమ్మసముద్రం, తిరువణంపల్లి, చింతమాకులపల్లి, కారకంపల్లి గ్రామానికి చెందిన బలిజ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. వారు ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర క్షీరాభిషేకం నిర్వహించారు. మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు.
విఘ్నేశ్వరునికి శతకలశ క్షీరాభిషేకం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి తిరుకల్యాణం, అశ్వవాహన సేవ ఇందులో భాగంగా ఆలయ అలంకార మండపంలో రెండు ఉత్సవాలకు సంబంధించిన ఉభయదారులు వేర్వేరుగా ఉత్సవమూర్తులకు సాంప్రదాయబద్దంగా అష్టోత్తర శతక్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా క్షీర కలశాలను ఉభయదారులు కాణిపాకం వీధుల్లో ఊరేగింపుగా తీసుకొని ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ అలంకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయదారుల సమేతంగా వినాయకుని ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో ఈవో దేముళ్లు, ఎఈవోలు రవీంద్రబాబు, విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.