రాష్ట్రీయం

సింగరేణి కార్మికులకు రూ. లక్ష బోనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రభుత్వం తెస్తున్న అప్పులు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్న తపనతోనే తప్ప మరే ఇతరత్రా అవసరాలకు కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టులపై రాద్దాంతాలు, నిందారోపణలు మానుకుని, వాటి నిర్మాణాలకు సహకరించాలని ముఖ్యమంత్రి ప్రతిపక్షాలకు హితవు పలికారు. ప్రభుత్వం చేసిన అప్పులను దుర్వినియోగం చేస్తోందని, అందుకే రాష్ట్రం అప్పులపాలు అవుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం ఎదురుదాడికి దిగారు. గురువారం శాసన సభలో సాగునీటి ప్రాజెక్టులపై నిధులు, నిర్మాణాలపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రాజెక్టుల పురోగతిపై వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి జలాలు ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల్లోకి వస్తున్నాయని, దీనితో పరివాహక ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని సీఎం అన్నారు. మరో రెండేళ్లలో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు.సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికులకు దశరా పండుగ సందర్భంగా బోనస్ ఇస్తున్నట్లు కేసీఆర్ గురువారం శాసన సభలో ప్రకటించారు. సింగరేణిలో పని చేసే ప్రతి కార్మికునికీ లక్షా 899 రూపాయలను బోనస్‌గా అందివ్వనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి బొగ్గు గనులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా పని చేయడంతో, గణనీయమైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు. తెలంగాణకు ఆవిర్భావంతో తర్వాత సింగరేణి ప్రగతి అద్భుతమన్నారు. అపారమైన ఖనిజ సంపదను వెలికి తీయడానకి కార్మికులు పడుతున్న శ్రమ వెలకట్టలేనిదన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కార్మికునికి 13.500 దక్కితే 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ప్రతి కార్మికునికి ఒకలక్షా 899 రూపాయలు దక్కాయన్నారు.ప్రజల భద్రత విషయంలో రేయింబవళ్లు పోలీసులు అప్రమత్తంగా ఉంటారని, వారికి సైతం వారానికి లేదా పది రోజులుకు ఒక సెలవును ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామ వెల్లడించారు.