రాష్ట్రీయం

కాప్ యాప్‌తో స్పాట్ క్రైం గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: కాప్ యాప్‌తో స్పాట్ క్రైంను గుర్తించవచ్చని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన కాప్‌యాప్‌ను ప్రారంభించారు. అదేవిధంగా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజిటర్స్ లాంజ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ కాప్‌యాప్‌లోని అప్లికేషన్లు పోలీస్ వ్యవస్థకే కొలమానంగా మారాయన్నారు. ఈ ఆధునిక టెక్నాలజీతో నేరాల అదుపుతోపాటు నేర పరిశోధనలు, నేరస్థులను పట్టుకోవడంలోనూ ఎంతో దోహదపడుతుందన్నారు. స్పాట్ క్రైం, స్పాట్ విచారణకు దోహదపడే ఈ కాప్‌యాప్‌ను ప్రారంభించుకోవడం ముదావహమన్నారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పోలీస్ వ్యవస్థ పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని డిజిపి తెలిపారు. ప్రపంచంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థకు మంచి గుర్తింపు లభిస్తుందని, ఆ దిశగానే పోలీసు సిబ్బంది పనిచేస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ పోలిసింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. నగర పోలీసులకు కొత్తగా ఏర్పాటు చేసిన కాప్‌యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నేరాల అదుపునకు కొత్తగా ప్రవేశపెట్టిన కాప్‌యాప్‌ను పోలీసు అధికారులు సద్వినియోగం చేసుకోవాలని, నేర రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు సిపి అంజనీకుమార్, జితేందర్, షీ టీమ్స్ అధికారిణి స్వాతిలక్రా, నాగిరెడ్డి, జెసి (అడ్మినిస్ట్రేషన్) మురళీకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం నగర పోలీస్ యాప్‌ను ప్రారంభిస్తున్న డిజిపి అనురాగ్ శర్మ