రాష్ట్రీయం

పెరుగుతున్న కేన్సర్ రోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేన్సర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. 1990లో ఒక లక్ష జనాభాకు 54 మంది రోగులు ఉండగా, 2016కు 72 మందికి పెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక లక్ష జనాభాకు 1990లో 58 మంది ఉండగా, 2016 నాటికి 76 మందికి పెరిగారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి నిర్వహించిన సర్వేలో వివరాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో సాధారణంగా కడుపు,రొమ్ము కేన్సర్‌లు ఎక్కువగానమోదవుతున్నాయి. ఆ తర్వాత ఊపిరితిత్తులు, నోటి కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. పురుషుల్లో ఊపిరితిత్తులు, నోటి కేన్సర్, కడుపులో కేన్సర్‌లు ఎక్కువ. కాగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ 2018లో కేన్సర్, ఇతర వ్యాధులపై సర్వే నిర్వహించి విడుదల చేసింది. దేశం మొత్తం మీద 2018లో ఎన్‌సీడీ క్లినిక్‌లలో 1,68,122 కేన్సర్ వ్యాధి ఉన్నట్లు స్క్రీనింగ్‌లో నిర్థారించారు. ఈ క్లినిక్‌లలో 6,651,94,599 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 31,02,186 మందికి మదుమేహ వ్యాధి, 40,38,166 మందికి రక్తపోటు, గుండె వ్యాధులు 69,413 మందికి ఉన్నట్లు వెల్లడైంది. కేన్సర్ వ్యాధికి సంబంధించి చూస్తే దేశంలో గుజరాత్‌లో 72,169 మందికి, కర్నాటకలో 20,084 మందికి, మధ్యప్రదేశ్‌లో 14,103 మందికి, తెలంగాణలో13,130 మందికి, ఆంధ్రాలో 5705 మందికి కేన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్థారించారు. కామన్ కేన్సర్‌లో నోటి, గర్భాశయం, రొమ్ము కేన్సర్‌లు వస్తాయని బ్యూరో పేర్కొంది.
పాము కాటు వల్ల దేశంలో 2018లో 885 మంది మరణించారు. ఇందులో పురుషులు 502 మంది, మహిళలు 383 మంది ఉన్నారు. దేశంలో 1,64,031 మంది పాముకాటుకు గురయ్యారు. ఇందులో పురుషులు 1,00,639 మంది, మహిళలు 63,349 మంది ఉన్నారు. పాము కాటుకు గురై మరణించిన వారిలో ఎక్కువ మంది పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నారు. 2018లో పశ్చిమబెంగాల్‌లో పాముకాటుకు గురై 203 మంది, ఆంధ్రాలో 117 మంది, తెలంగాణలో 9 మంది మరణించారు. కాగా కేసుల పరంగా విశే్లషిస్తే పాము కరచిన కేసులు ఆంధ్రాలో 25,964, తెలంగాణలో 3306 కేసులు, మహారాష్టల్రో 18,707 కేసులు, పశ్చిమబెంగాల్‌లో 36,229 కేసులు నమోదయ్యాయి. లక్షదీప్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దేశ రాజధాని ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, గోవా, జమ్ము, మణిపూర్, సిక్కింలో పాముకాటుకు గురై ఒక్కొక్కరు మరణించారు.