రాష్ట్రీయం

తెగిపడ్డ ఓహెచ్‌ఈ లైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, నవంబర్ 21: విజయవాడ - కాజీపేట రైల్వేసెక్షన్‌లో కేసముద్రం - ఇంటికనె్న స్టేషన్ల మద్య విద్యుత్ సరఫరా చేసే ఓహెచ్‌ఈ లైన్ తెగిపడటంతో మణుగూర్ నుండి కొల్హాపూర్ వెళుతున్న కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం రాత్రి పదకొండు గంటల వరకు ఘటనా స్థలిలో నిలిచిపోయింది. రాత్రి 6-30 గంటలకు కేసముద్రం రావాల్సిన ఈ రైలు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. అయితే కేసముద్రం నుండి బయలుదేరిన కొద్ది సమయానికే విద్యుత్‌లైన్ తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైలు ఇంటికనె్నకు రెండు కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. విద్యుత్‌లైన్ తెగిపోయిన విషయాన్ని నెక్కొండ ఓహెచ్‌ఈ మరమ్మతు విభాగానికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. ఈ కారణంగా డోర్నకల్ - కాజీపేట సెక్షన్‌లో అప్‌లైన్‌లో రైళ్లు నిలిచిపోయాయి. రాత్రి 11 గంటల వరకు సిబ్బంది మరమ్మతులు చేస్తూనే ఉన్నారు.