రాష్ట్రీయం

రోహిత్ వడ్డెర కులస్థుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల వడ్డెర కులస్థుడేనని, ఈ కులం బిసిల జాబితా పరిధిలోకి వస్తుందని, తాము చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం వెల్లడయిందని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పేర్కొంది. ఈ అఫిడవిట్‌ను రోహిత్ కేసు దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసు స్టేషన్ సిఐ రామచంద్రరావు హైకోర్టులో దాఖలు చేశారు. హెచ్‌సియుతో పాటు అంతకు ముందు రోహిత్ చదివిన కాలేజీ రికార్డుల ప్రకారం అతను మాల (ఎస్సీ) కులస్థుడని తేలిందని, అయితే తాజాగా గుంటూరు జిల్లా గురజాల మండల రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు, నివేదిక ప్రకారం రోహిత్ వేములను వడ్డెర కులానికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారని దర్యాప్తు అధికారి హైకోర్టుకు తెలిపారు. రోహిత్ కులంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో అతను వాస్తవంగా ఏ కులానికి చెందినవాడో తెలియజేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు.
రోహిత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిలో హెచ్‌సియు విసి పి.అప్పారావు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, బిజెపి ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఏబివిపి నేత సుశీల్ కుమార్ ఉన్నారని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. అలాగే ఈ ఘటనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దౌర్జన్యాల నిరోధక చట్టం కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎవరిపైనైనా ఈ చట్టాన్ని ప్రయోగించాలంటే బాధితుడు ఎస్సీ కులానికి చెందినావాడై ఉండాలి. అయితే తమ అభ్యర్ధన మేరకు ఈ అంశంపై విచారణ జరిపిన గుంటూరు అర్బన్ తహశీల్దారు కూడా రోహిత్‌తో పాటు అతని తల్లి రాధిక, ఇద్దరు సోదరులు గిరిధర్ కుమార్, శ్రీ్ధర్ వడ్డెర కులస్థులేనని నివేదిక ఇచ్చారని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అలాగే రాధిక వడ్డెర కులస్థురాలేనని ఆమె భర్త నాగ మణికుమార్ కూడా వాంగ్మూలం ఇచ్చాడని ఆయన హైకోర్టుకు తెలియజేశారు.