రాష్ట్రీయం

ఇక జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: ఇకపై తెలంగాణ పోలీస్ స్టేషన్లలో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బాధితులు కోరవచ్చు.. ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిర్యాదు చేయడానికి బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వస్తే తమ పరిధిలోకి రాదని చెబితే మాత్రం సంబంధిత స్టేషన్‌లో పనిచేసే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేర సంఘటనల పట్ల ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నేర సంఘటనలు జరగకముందే ముందస్తు చర్యలు తీసుకుంటే నేరవృత్తిని తగ్గంచినట్లు అవుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మహిళలకు భద్రత, రక్షణ వంటి విషయాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణ అంశాలపై మంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని హోంమంత్రిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్రంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్నంగా హోంమంత్రి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘దిశ’ సంఘటనపై ప్రభుత్వం పాస్ట్‌ట్రాక్ కోర్టునుప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. కేసును త్వరితగతిగా పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందన్నారు. పోలీస్, విద్య, మహిళల సంక్షేమ శాఖల పర్యవేక్షణలో మహిళలకు సంబంధించిన వేధింపులు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు, అదృశ్యం తదితర అంశాలపై విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలను వేగవంతం చేయాలని హోంమంత్రి సూచించారు. రాష్ట్రంలో పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షీ టీమ్‌ను పటిష్టపర్చడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందన్నారు. బాధితులు ఎక్కడైనా ‘హ్యాక్ ఐ’ యాప్‌ను వినియోగించుకోవచ్చునని ఆయన గుర్తు చేశారు. బాధితులు 100, 181, 1098తో పాటు 112 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా ఆయా స్కూళ్లలోని నోటీసు బోర్డ్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లను చూపించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, క్యాబ్స్‌లపై హెల్‌లైన్ నెంబర్లు ఉండాలని సూచించారు. మహిళల రక్షణ, భద్రత అంశాలపై టీవీ చానల్స్, సార్ట్ ఫిలింలు, స్కైట్స్, స్లైడ్స్‌ల ద్వారా ప్రచారం చేయాలన్నారు. విద్యార్థులు పుస్తకాలపై హెల్ప్‌లైన్ నెంబర్లు ఉండాలని విద్యాసంస్థలను ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్, ప్రభుత్వం కార్యాలయాలు, మెట్రో రైల్వే స్టేషన్లు వద్ద హెల్ప్‌లైన్ నెంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రత్యేక క్లాసుల కోసం బయటికి వెళ్తుంటే హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆకతాయిలు ఎవరైనా అమ్మాయిలను వెంటపడుతుంటే హెల్ప్‌లైన్ నెంబర్లుకు చెప్పడంతో పాటు పంచాయితీ సెక్రటరీలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఏడు రోజుల పోలీస్ కస్టడీ
‘దిశ’ కేసులో నలుగురు నిందితులకు ఏడు రోజుల పోలీస కస్టడీకి అంగీకరిస్తూ షాద్‌నగర్ కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తృప్తి దేశాయ్‌ను అడ్డుకొన్న పోలీసులు
దిశ హత్యపై సామాజిక కార్యకర్త తృప్తిదేశాయ్ హైదరాబాద్ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. తృప్తి దేశాయ్ రాకపై ముందస్తు సమాచారం అందడంతో పోలీసులు ముందుగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తృప్తిదేశాయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ సంఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘దిశ’ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం కేసీఆర్‌కు తీరిక లేదా? అంటూ ఆమె ప్రశ్నించారు.
*చిత్రం... సమీక్షస్తున్న తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ