రాష్ట్రీయం

అపచారం జరగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: యాదగిరి గుట్ట (యాదాద్రి) శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మూలవిరాట్‌కు ఎలాంటి అపచారం జరగలేదని ఈ ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీగర్ లక్ష్మీనర్సింహాచార్యులు స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలయ మూలవిరాట్‌కు అపచారం జరిగిందంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తపై వివరణ ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణ పనుల సందర్భంగా రసాయనాల వల్ల విగ్రహాలకు నష్టం వాటిల్లకూడదని నిర్ణయించామన్నారు. ఇందుకు అనుగుణంగా మూలవిరాట్‌పై ఉన్న సింధూరం, చందనాన్ని తామే తొలగించామన్నారు. తిరుపతి, శ్రీశైలం తదితర ప్రధాన ఆలయాల్లో కూడా మూలవిరాట్‌పై ఉండే చందనాన్ని అప్పుడప్పుడూ శుభ్రం చేస్తుంటారని గుర్తు చేశారు. మూలవిరాట్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి రూపంలో ఎలాంటి మార్పు జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవంగా నర్సింహస్వామి రూపమే ఉగ్రరూపమని, అమ్మవారితో కలిసి ఉండే లక్ష్మీనర్సింహస్వామి ప్రశాంతమూర్తి అంటూ వివరించారు. ఆలయంలో నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులను రోజూ పరిశీలిస్తామని, పరిశుభ్రంగా ఉంటేనే లోపలకు అనుమతిస్తామన్నారు. తాను 40 సంవత్సరాల నుండి స్వామి వారి కైంకర్యాలలో పాల్గొంటున్నానని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సమావేశంలో యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పనిచేసే అర్చకులు కారంపూడి నర్సింహాచారి, రంగాచారి, రాఘవాచారితో పాటు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి గీత, యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) వైస్-చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి. కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... మీడియా సమావేశంలో మాట్లాడుతున్న యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీనర్సింహాచార్యులు