రాష్ట్రీయం

ఇంకుడు గుంతలే కరవుకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఈ ఏడాది దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు, అనావృష్టి పరిస్థితుల నుంచి బయటపడి నీటి ఎద్దడి తలెత్తకుండా నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యల్లో భాగంగా నీటి నిల్వ విధానాలను అమలు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ సూచించారు.
ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకోవడం, నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేయడం ద్వారా నీటి ఎద్దడిని జయించవచ్చన్నారు. నదీ ఒడ్డున చెక్ డ్యామ్‌లను నిర్మించడం, భూగర్భ జలాలను పరిరక్షించుకోవడం, ఇంకుడు గుంతలు తవ్వడం, భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టడం అవసరమని ఆయన పేర్కొన్నారు. వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖర్లతో ముచ్చటించారు. భూగర్భ జల వనరుల గుర్తింపు కోసం కరవు ప్రాంతాల్లో సర్వే జరగాలని, ఇందుకు ఇస్రో సేవలను వినియోగించుకోవాలన్నారు. ఇళ్ల పైకప్పుల మీద కూడా వర్షపు నీటిని నిల్వ చేసి ఇంకుడు గుంతల్లోకి మళ్లించాలన్నారు. దేశంలో కరవు నివారణ దిశగా పరిశోధనలు జరగడంలేదన్నారు. మంచినీరు, ఆహారోత్పత్తిని పెంచడం, హెల్త్‌కేర్ రంగాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధన చేపట్టాలన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కరవు పరిస్థితులపై ఇస్రో 2005లోనే సర్వేలు జరిపి నివేదికలు ఇచ్చిందన్నారు.