ఆంధ్రప్రదేశ్‌

మే 24న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: వచ్చే నెల 24న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇంటర్‌మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రతిభా పాటవాలు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకులనే నియమిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని వసతులు సమకూరుస్తున్నా ఫలితాల్లో మాత్రం ఆశాజనకంగా ఉండడం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే మున్సిపల్ స్కూళ్లలో ప్రవేశపెట్టామని వివరించారు. ప్రైవేటు స్కూళ్ల మాదిరిగా ప్రస్తుత వేసవిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్టు ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు - మన బడిపై ప్రత్యేక ప్రచారం ప్రారంభిస్తున్నామని వివరించారు. ఈసారి ఇంటర్ పరీక్షల నిర్వహణలోను, మూల్యాంకనంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సిసి కెమెరాలు ఏర్పాటు చేసి, మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డ 70 మందిని గుర్తించి సరెండర్ చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటమేగాక భవిష్యత్తులో వీరందిరినీ మూల్యాంకానికి దూరంగా ఉంచుతామన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న అధ్యాపకులకు 25 శాతం అదనపు రెమ్యూనరేషన్ చెల్లించామన్నారు. ఈ ఏడాది ఒకేషనల్ కోర్సు మూల్యాంకనం ఆన్‌లైన్‌లోనే చేశామన్నారు. ఇంటర్‌లో తిరిగి జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవి సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే నెల 24 నుండి నిర్వహించే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 26వ తేదీలోగా పరిక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఇంటర్ రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 26వ తేదీ ఆఖరు తేదీ అని చెప్పారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎల్‌ఆర్ బాలాజీ, ఆర్‌ఐఓ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు విద్యార్థుల ప్రతిభ
నెల్లూరు కలెక్టరేట్: ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలలో జిల్లా బాలికలు సత్తా చాటారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖామంత్రి విడుదల చేసిన సీనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాల్లో 74.14శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఉన్న వృత్తి విద్యా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలో నాలుగవ స్థానాన్ని సంపాదించారు. కాగా జిల్లాలోని సౌత్ మోపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్‌మీడియట్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించింది. 99శాతంతో తోటపల్లి గూడూరు, 98.3శాతంతో ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ద్వితీయ, తృతీయ స్థానాలు పొందాయి. జిల్లాలోని దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్ధిని ఎం గౌరమ్మ(ఎంపిసి), జ్యోతి మానస(బైపిసి)లో పూజిత (ఒకేషనల్) విభాగంలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి బాబూ జాకబ్ చెప్పారు. కాగా వృత్తి విద్యా కోర్సులో జి కవిత జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది.
సత్తాచాటిన శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం: కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిన వారికి దీటుగా ర్యాంకులు సాధించి సత్తాచాటారు శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు. ఏకంగా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. వెనుకబడిన జిల్లాగా పేరున్న శ్రీకాకుళం విద్యార్ధులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువులు సాగించి ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించారు. 76 శాతం ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో జిల్లాను నిలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని 85 ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 5,954 మంది ఉత్తీర్ణత సాధించారు.