రాష్ట్రీయం

సైకిలెక్కిన బొబ్బిలి ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పక్ష తెలుగుదేశంలోకి వలసలు మళ్లీ ఊపందుకున్నాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి వైకాపా శాసనసభ్యుడు సుజయ్ కృష్ణ రంగారావు బుధవారం సాయంత్రం స్థానిక హోటల్‌లో అర్భాటంగా జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుచే పచ్చ కండువా కప్పించుకున్నారు. దీంతో తెలుగుదేశంలోకి వలస వెళ్లిన వైకాపా శాసనసభ్యుల సంఖ్య 11కు చేరినట్లయింది. ఎమ్మెల్యే రంగారావుతో పాటు గత ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసిన సోదరుడు బేబీ నాయన, పెద్దసంఖ్యలో జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు కూడా టీడీపీలోకి వలసబాట పట్టారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ జగన్‌పట్ల తనకు గౌరవం ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతున్నట్లు
ప్రకటించారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజుతో కలిసి పనిచేసే అవకాశం లభించడాన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బొబ్బిలిని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో చేరుతున్న వారందరినీ మనసారా అభినందిస్తూ స్వాగతం పలికారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందంటూ బాధను వ్యక్తం చేశారు. రాజధాని లేకుండా కనీసం వౌలిక సదుపాయాలు లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంతో ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కల్గిన తానే నేటికీ ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నానని అన్నారు. ఈ సంక్లిష్ట పరిస్థితులలో ప్రజలు తనపై విశ్వాసం ఉంచి అధికారం అప్పగించారంటూ అందుకే వారి ఆశలు అడియాసలు చేయకుండా శ్రమిస్తున్నానని అన్నారు. ఆర్థిక సంక్షోభం వల్ల ఎన్నికల హామీలన్నింటినీ ఒక్కసారిగా అమలు చేయలేకపోతున్నా ఒకదాని వెంట మరొకటిగా అమలు చేస్తున్నామన్నారు. విభజన చట్టంలోని అంశాలన్నింటిని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఆయినా కేంద్రం నుంచి ఆశించినంత సాయం అందటం లేదంటూ అవసరాలకు అప్పు చేయాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి నెలకొందంటూ అసహనం వ్యక్తం చేశారు. మే నెలలో రెండోవిడత రుణ మాఫీ వర్తింప చేయగలమంటూ భరోసా ఇచ్చారు. తెలుగుదేశంలోకి కొత్తగా వస్తున్న వారందరూ పాతవారిని కలుపుకుంటూ పార్టీ అభివృద్ధికి పాటుబడాలంటూ బాబు కోరారు.

chitram బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు