రాష్ట్రీయం

రెప్పపాటూ కరంట్ పోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: తెలంగాణలో ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి కార్యాచరణ అమలు చేస్తున్నట్టు టి జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావుప్రకటించారు. ఒక్క రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఎండాకాలంలోనూ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని మొత్తం పది జిల్లాల్లో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల యాజమాన్యం, రైతులు, గృహ రంగంలో వినియోగదారులు సంతృప్తిగా ఉండేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుఅనుసరించిన ముందస్తు వ్యూహమే కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున ప్రతి రోజూ 146 ఎంయు విద్యుత్ డిమాండ్ ఉంటే, అంతే మొత్తంలో విద్యుత్‌ను తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సంస్ధలు సరఫరా చేస్తున్నాయి. విద్యుత్ కోతల నివారణకు, కొరత తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికతతో ఇచ్చిన ఆదేశాలపై 1720 మెగావాట్ల విద్యుత్‌ను జెన్కో, ట్రాన్స్‌కోలు చేస్తున్నాయి. గత ఏడాది కూడా బడ్జెట్‌లో విద్యుత్ కోతల నివారణకు, కొనుగోళ్లకు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ సంవత్సరం కూడా స్వల్ప, దీర్ఘకాలిక ఒప్పందాలపై 1720 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు తగిన ప్రణాళికను ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన సమయంలో దాదాపు 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండేదని, కాలక్రమంలో బాలారిష్టాలు అధిగమించామని ప్రభాకరరావు చెప్పారు. పంపిణీ నష్టాలు తగ్గించుకున్నామన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్ధను పటిష్టం చేసేందుకు దాదాపు రూ.2400 కోట్లు ఖర్చుపెట్టామన్నారు. భూపాలపల్లి నుంచి 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. కేంద్రంలోని ఎన్టీపిసి నుంచి కూడా విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యుత్ శాఖలో అనేక కారణాల వల్ల విద్యుత్ ఇంజనీర్ల కొరత ఉన్నా, ఇక్కడ ఉన్న ఇంజనీర్లు నలుగురు చేసే పని చేయడం కూడా విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కారణమన్నారు.
‘ ఇంకా వేసవి 45 రోజులుంది. ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. సగటున ప్రతి రోజూ 180 ఎంయు విద్యుత్ డిమాండ్ ఏర్పడినా తట్టుకుంటాం ’ అని ప్రభాకరరావు చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను మనకు విద్యుత్ అప్పటికప్పుడు అవసరమైనప్పుడు చేసుకోమని, ముందుగానే వాస్తవ పరిస్ధితిని అంచనా వేసి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం థర్మల్ నుంచి 41.457 ఎంయు, కేంద్ర విద్యుత్ స్టేషన్లు, విద్యుత్ కొనుగోళ్లద్వారా 66.277 ఎంయు, సంప్రదాయేతర విద్యుత్ 18.701 ఎంయు, ఏపిఐఎస్‌టిఎస్‌లో తెలంగాణ వాటా కింద 20.503 ఎంయు విద్యుత్ కలిపి 146.938 ఎంయు విద్యుత్ లభిస్తోందన్నారు. ప్రస్తుతం 7200 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, వచ్చే ఖరీఫ్ నాటికి ఈ డిమాండ్ 9వేల మెగావాట్లలకుపెరుగుతుందని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. వ్యవసాయానికి ఎటువంటి ఆటంకం లేకుండా 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు.