రాష్ట్రీయం

అక్రమ నల్లాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: ఇంకుడు గుంతలుంటేనే కొత్త భవనాలకు అనుమతివ్వడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. అలాగే అక్రమంగా నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం మోపుతామని, నల్లాల క్రమబద్ధీకరించేందుకు మార్గాన్ని సుగమం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నెలకొన్న కరవు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, వీటి నివారణకు ఉద్దేశించిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరముందని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, మున్సిపల్ శాఖ వందరోజుల కార్యచరణపై బుధవారం హైదరాబాద్ మెట్రోరైలు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిహెచ్‌ఎంసి తరపున అమలవతున్న కార్యక్రమాలను కమిషనర్ జనార్దన్ రెడ్డి, హెచ్‌ఎండిఏ కమిషనర్ చిరంజీవులు విభాగాల వారీగా మంత్రికి వివరించారు. జిహెచ్‌ఎంసి వార్డు కమిటీల ఎన్నికను త్వరలోనే పూర్తి చేస్తామని కమిషనర్ వివరించారు. కరవు పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నెలకొన్న నీటి ఎద్దడిని ప్రస్తావిస్తూ అవసరమైన నీటి వనరులు, నీటి నిల్వల గురించి అడిగి తెల్సుకున్నారు. కృష్ణా, గోదావరిల్లో ఉన్న నీటి నిల్వలతో నగరానికి నీళ్లు అందించే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకునేందుకు నగరంలోని ఐటి పార్కులు, పారిశ్రామికవాడలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొత్తగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించాలన్నారు.
రానున్న వర్షాకాలం ఎదురయ్యే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు కాస్త ముందుగానే కార్యచరణను సిద్ధం చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరధ(అర్బన్)పై చర్చించారు. వచ్చే వారంలో పరిపాలన అనుమతిని ఇస్తామని, ఇక వందరోజుల ప్రణాళికలో భాగంగా పెట్టుకున్న మ్సుపాల్టీల్లో ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ సాధ్యం అవుతుందన్న అధికారులు, ఇక ఎల్‌ఇడి లైట్లను భిగించే ప్రక్రియపై కూడా మంత్రి ఆరా తీశారు. మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ కోసం జియోట్యాగింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమీక్షలో మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ యం.జి.గోపాల్ కూడా ఉన్నారు.

chitram మున్సిపల్ శాఖ వంద రోజుల ప్లాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్